
అయితే ఈ విమాన ప్రమాదానికి ముఖ్య కారణం FADEC వైఫల్యం వల్లే ఇలా జరిగిందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ వల్ల ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయ్యి ఇంజన్ కు ఇంధనం అందకుండా చేసిందని, అందువల్లే ఎగిరిన విమానం పూర్తిగా ఎగరలేక మళ్ళీ కూలిపోయి ఉండవచ్చు అంటూ అంచనా ఉందని తెలుపుతున్నారు. బ్లాక్ బాక్స్ అనాలసిస్ ద్వారా మరికొన్ని అంశాలు కూడా పరిశీలనలతో స్పష్టత రాబోతోంది అంటూ తెలిపారు. ఫ్యూయల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ గా పిలిచేటువంటి FADEC సిస్టం విమానం యొక్క ప్రయాణాన్ని అన్ని అంశాలతో సమన్వయం చేస్తుందట. అయితే దీనిని పైలెట్ ఓవర్ రైట్ చేయలేరని అధికారులు తెలియజేస్తున్నారు.
మొత్తానికి ఏది ఏమైనా ఎంతోమంది ప్రాణాలు పోయేలా చేసింది ఈ ఎయిర్ ఇండియా. అయితే ఇందులో మరణించిన ప్రతి కుటుంబానికి కూడా సుమారుగా 1.5 కోట్ల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పరిహారం మొత్తం కూడా విమాన సంస్థ టాటా పైన ఆర్థిక భారాన్ని చూపిస్తుందని తెలిపారు. ఎందుకంటే ఈ విమానానికి పూర్తి బీమా ఉన్నదంటూ తెలియజేశారు . దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మొత్తం మీద 360 కోట్ల రూపాయలు పరిహారం అందవచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఇక ఈ విమానం భీమా $115 మిలియన్ డాలర్లు. సుమారుగా రూ.680 నుంచి రూ.980 కోట్ల వరకు ఉంటుందట.