
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో సక్సెస్ సాధించి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు. అయితే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అలా తెరపై కనిపించాలని ఉందని పవన్ కళ్యాణ్ చెపుకొచ్చారు. పవన్ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలలో ఏ పాత్ర కూడా నా మనసుకు పూర్తిస్థాయిలో చేరువ కాలేదని ఆయన తెలిపారు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో అదే విధంగా వెండితెరపై కనిపించాలని ఉందని ఆయన కామెంట్లు చేశారు. కానీ అది సినిమాల్లో సాధ్యకాపాడకపోవచ్చని ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సినిమాల్లోకి అడుగుపెట్టాలని నటుడిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అని మాది మధ్య తరగతి కుటుంబం అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. నాన్న కమ్యూనిస్ట్ భావాలను పాటించేవారని నాన్న వల్లే మా కుటుంబ సభ్యులకు రాజకీయాలపై అవగాహనా వచ్చిందని పవన్ తెలిపారు. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా సమాజంపైనే నా దృష్టి ఉండేదని చెప్పుకొచ్చారు.
ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒకానొక సమయంలో బాలీవుడ్ సినిమాలు వచ్చేవని దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదని ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వారు కథలు అందించలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. పవన్ చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.