
సినిమాలు తీసే వాళ్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాల్సిన పరిస్థితి ఉందంటూ జర్నలిస్ట్ వెంకటకృష్ణ హెచ్చరిస్తున్నారు. పర్టిక్యులర్ గా డైరెక్టర్ సుకుమార్ లేకపోతే బోయపాటి శ్రీను ఇలాంటి టైపులో తీసే సినిమాల డైరెక్టర్లు అందరూ కూడా జాగ్రత్తగా తీయాలని.. హింసని ఎక్కువ తీసే సినిమాలు ఎవరు తీసిన కూడా చూసుకొని తీయాలి అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఎలివేషన్స్ సొసైటీలో కూడా కనిపిస్తూ ఉన్నాయని.. మీరు ఏదో కాసేపు వినోదం కోసం నాలుగు ఫ్రేమ్ లే కదా అని తీస్తారు మీరు.. ఇలాంటి ఎలివేషన్ పట్టుకుంటున్నారు. జగన్ లాంటి ఎలివేషన్స్ ఉన్నాయి ఆయన ఇలాంటివి చేస్తే తప్పేమి ఉందంటున్నారు అంటూ హెచ్చరించారు.
సినిమా అనేది చాలా పవర్ ఫుల్ మీడియా అంటూ తెలిపారు.. మీరు తీసే సినిమాలు ప్రజల మీద సమాజం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయంటూ తెలిపారు. ముఖ్యంగా సైకో వ్యక్తుల మీద ఇవన్నీ ఎక్కువగా చూపిస్తాయని తెలిపారు జర్నలిస్ట్ వెంకటకృష్ణ.. ఫ్లెక్సీలు వీడియోలు చూస్తూ ఉంటే అందరి మీద కేసులు వేయాలనిపిస్తోంది అంటూ హెచ్చరించారు. వీటితో పాటు నేతలు, కార్యకర్తలు మాట్లాడే మాటలు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయంటూ తెలుపుతున్నారు. AI ద్వారా టిడిపి వాళ్లు వీడియోని మార్చి చూపించారు అంటున్నారు అంటు కూడా వెల్లడించారు. సమాజంలో ఇలాంటి లీడర్లు, కార్యకర్తలు కూడా కత్తులు పట్టుకుని డాన్స్ వేస్తున్నారంటు వెల్లడించారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.