గత కొద్ది రోజుల నుంచి ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న ఉండగా.. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకొని ఇరాన్ పైన దాడి చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే.. దీంతో ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా చూసేందుకు పలు రకాల సన్నహాలు చేసింది అమెరికా. ఆ దేశంలో మూడు అను కేంద్రాల పైన కూడా దాడి చేసి వాటిని విజయవంతంగా నాశనం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు.. అయితే ఇరాన్ లో అణుబాంబులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేకపోయారంటూ అమెరికా నిఘా సంస్థ పలు నివేదికలను తెలియజేసింది.



పెంటగాన్ నిఘా విభాగం డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవలే విడుదల చేసినటువంటి నివేదికల ప్రకారం ఇరాన్ అణు కేంద్రాల పరిస్థితి పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నేతాన్వహు చేసిన వాదనలకు చాలా భిన్నంగా ఉన్నాయంటూ తెలియజేశారు.. జూన్ 22న అమెరికా ఇరాన్ లోని ఉండే ఫోర్డో, ఇన్ఫహాన్, నటాంజ్ వంటి ప్రాంతాలలో అణుబాంబు కేంద్రాలుగా ఉన్నాయి. వీటి పైన వైమానిక దాడులు అమెరికా చేసిందని ఈ కేంద్రాల లో అణుబాంబు అభివృద్ధి చేయడానికి రహస్యంగా ఉపయోగించినటువంటి పదార్థాలను పేల్చేశామంటూ అమెరికా వెల్లడించింది.


ఫోర్డో, ఇన్ఫహాన్, నటాంజ్ వంటి ప్రాంతాలలో దాడి చేసినప్పటికీ కొంతమేరకు నష్టమైతే కలిగించారు కానీ అవి పూర్తిగా నాశనం కాలేదని పలు రకాల నివేదికలు వెల్లడిస్తున్నాయట. దాడుల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఈ సమాచారాన్ని బయటపెట్టారు.. ఇరాన్ వద్ద ఉండేటువంటి యురేనియం నిల్వలు నాశనం కాలేదని , చాలావరకు పదార్థాలు చెక్కుచెదరకుండానే ఉన్నాయంటూ వెల్లడించారట. అమెరికా దాడులను సైతం ఇరా ముందుగానే అంచనా వేసి అక్కడి నుంచి యురేనియం తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా అణుబాంబు కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేయగలిగిందేమో కానీ ఆపలేకపోయిందనే విధంగా నివేదికలు తెలుపుతున్నాయి. మరి ఈ విషయం తర్వాత అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ అమెరికా మధ్య పోటీలలో ఇరాన్ దే పై చేయి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: