గత కొన్నేళ్లలో ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరిగిందా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన దేశంలోని యువత పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెళ్లి చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు. 30 ఏళ్ళు దాటినా చాలామంది పెళ్లిపై అయిష్టత చూపుతున్నారు.

పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ, స్వతంత్రం కోల్పోతామని మరి కొందరు ఫీలవుతున్నారు.  ఇండియన్ యువత అభిప్రాయాలూ సైతం ఊహించని విధంగా మారిపోతున్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.  30000, 40000 శాలరీతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలలో బ్రతకడం కష్టమని  అమ్మాయిలతో పాటు అబ్బాయిలు సైతం భావిస్తున్నారు. ఎక్కువ శాలరీ ఉన్న ఉద్యోగులు సైతం  ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇండిపెండెంట్ గా బ్రతకడానికి సైతం కొంతమంది యువత ప్రాధాన్యత ఇస్తున్నారు.  పది శాతం యువత ప్రస్తుతం పెళ్ళికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.  కొందరు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పెళ్లికి దూరంగా ఉండటానికి   ఆసక్తి చూపుకున్నారు.  ఆచారాలు, సంప్రదాయాలను పట్టించుకోవడానికి సైతం  మరి కొందరు దూరంగా ఉంటున్నారు. ఈరోజులలో అమ్మాయిలు  సైతం అబ్బాయిలకు  పెళ్లి విషయంలో ఎన్నో షరతులు విధిస్తున్నారు.

 ఈ స్పష్టమైన మార్పు వెనుక  మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు కారణమని  చెప్పవచ్చు. జరుగుతున్న కొన్ని ఘటనలు  కూడా అబ్బాయిలలో పెళ్ళి పట్ల   ఇష్టం లేకపోవడానికి  కారణమవుతున్నాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకొని యువత సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  ఈ పరిస్థితిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు   ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

 

మరింత సమాచారం తెలుసుకోండి: