భారతదేశమంటేనే సర్వమత సమ్మేళనం. ముఖ్యంగా ఇక్కడ హిందూ జనాభా ఎక్కువగా ఉంటుంది. అయినా అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా అక్కా చెల్లెళ్ల లాగా కలిసి ఉండడం ఇక్కడి జనాల అలవాటు. అయితే ఇతర దేశాలు అభివృద్ధి లో దూసుకుపోతూ ఉంటే మన దేశంలో మాత్రం ఇంకా కులాలు, మతాలు అంటూ వాటి వెనకే తిరుగుతూ ఉన్నారు.. అంతేకాదు కొన్ని రాజకీయ పార్టీలు కూడా  కులాలను, మతాలను బేస్ చేసుకుని వారి రాజకీయ లబ్ది స్వార్థం ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రజలకు కుల మతాలను అంటగడుతూ వారి మధ్య చిచ్చులు పెడుతూ వారు రాజకీయ పబ్బం గడుపుతున్న సందర్భాలు అనేకం చూస్తూనే ఉన్నాం.


ఇదిలా ఉండగా దేశం లో ఈ మధ్య కాలంలో క్రైస్తవీకరణ అనేది ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఈ మధ్య కాలంలో భారత దేశంలో క్రైస్తవం ఎక్కువగా పెరిగిందని ఓ రిపోర్టు తెలియజేసింది. క్రైసవీకరణ ఎక్కువగా  పెరిగినటువంటి రాష్ట్రాలలో  చత్తీస్గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్  ఈ రాష్ట్రాల్లో మతమార్పిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల క్రైస్తవ జనాభా 41 శాతానికి పెరిగిపోయిందని   నేషనల్ మీడియా తెలియజేసిది. ఈ విధంగా దేశంలో క్రైస్తవవీకరణ అనేది వేగంగా పుంజుకుంటోంది అని అర్థమవుతుంది.

  మన దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎవరు ఏ మతంలోకైనా మారవచ్చు. అలాంటి ఈ తరుణం లో చాలామంది ప్రజలు క్రైస్తవవీకరణ వైపు అడుగులు వేసి క్రైస్తవ మతం చేపడుతున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే చత్తిస్ ఘడ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ఈ మూడు రాష్ట్రాల్లో క్రైస్తవ మతం లోకి ఎక్కువ మంది మారడంతో హిందూ జనాభా తగ్గి క్రైస్తవ జనాభా నే అక్కడ పెరుగుతుంది కావచ్చు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: