అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని డైలాగులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇందులో ముఖ్యంగా రప్పా రప్పా అనే డైలాగులు పొలిటికల్ పరంగా కూడా వార్ గా మారుతోంది. అటు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఇటీవలే కాలంలో ఈ డైలాగు ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు ఈ డైలాగ్ తాడిపత్రి టిడిపి నేత మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నా జెసి ప్రభాకర్ రెడ్డి నోటి వెంట వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన మరొక సారి ఫైర్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి.


నాకు వైయస్సార్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు కేవలం పెద్దారెడ్డి మాత్రమే అంటూ తెలుపుతూ అతడి వెంట ఎవరు వెళ్లినా కూడా వారిని కచ్చితంగా వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తమ పైన ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎప్పుడూ కూడా అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామంటూ తెలిపారు దివాకర్ రెడ్డి. వైసీపీలో పెద్దారెడ్డి అంటే కేవలం చిన్న లీడర్ మాత్రమే కాని ప్రజలలో నేను పెద్ద లీడర్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారంటూ ఫైర్ అయ్యారు.


త్వరలోనే మా కార్యకర్తలతో మీ ఇంటిని కూల్చేస్తామంటూ హెచ్చరించారు. నువ్వు తాడిపత్రి పట్టణానికి ఎప్పుడు వచ్చినా కూడా మా కార్యకర్తలు సైతం నిన్ను రప్పా రప్పా చేస్తామంటే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ డైలాగును నాలుగు సార్లు చెప్పారు ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి పట్టణానికి నువ్వు దొంగతనంగా వచ్చినావు త్వరగా రాలేదు అంటూ హెచ్చరించారు నాలుగు రోజులు నేను ఊర్లో లేకుండా వెళ్తున్నానని.. ఈ సమయంలో నువ్వు అడుగుపెడితే మా టిడిపి కార్యకర్తలు మీ ఇంటిని రప్పా రప్పా చేస్తారు అంటూ హెచ్చరించారు. మొత్తానికి పుష్ప సినిమాలోని డైలాగులు ఏపీ అంతా పాకినా ఇప్పుడు తాజాగా తాడిపత్రి నియోజకవర్గం లో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: