
ఈరోజు సాయంత్రం అన్నిటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..ఆసుపత్రిలో ఉన్న వారి పరిస్థితి నిలకడగానే ఉందని.. ఈ బ్లాస్ట్ ప్రమాదం వల్ల ఆ వేడికి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో మారిపోయినట్లుగా అక్కడ అధికారులు తెలుపుతున్నారు. కొంతమందిని డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను సైతం గుర్తించి మరి వారి యొక్క కుటుంబాలకు అప్పజెప్పినట్లు అధికారులు వెల్లడించారు. కాని ఎయిర్ వాక్స్/ డ్రైవర్ సమీపంలో ఎవరైనా కార్మికుల సైతం పనిచేస్తూ ఉంటే ఈ బ్లాస్ట్ కి వారి బూడిద కూడా దొరకదని అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే జరిగిన ఈ బ్లాస్ట్ కి వారి యొక్క ఎముకలతో సహా సజీవం అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం కార్మికుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా అక్కడ జరిగిన ఘటన దృశ్యాలు స్థలంలోని దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ త్రివ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి పరిశీలించక అక్కడ జరుగుతున్న ప్రమాద ఘటనల పైన కూడా అధికారులతో మీడియాతో మాట్లాడి ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు కూడా కోటి రూపాయలు చొప్పున ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలుపుతోంది. ఇకమీదట ఇలాంటి చర్యలు జరగకుండా తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.