పాకిస్తాన్ మన ఇండియాతో పోల్చుకుంటే  దాదాపు 8 రేట్లు చిన్నగా ఉంటుంది. మన సైన్యం గట్టిగా తిరగబడితే పాకిస్తాన్ ని మొత్తం మట్టు పెట్టగలదు. అంత చిన్న దేశమే ఇండియాపై విరుచుకుపడుతూ అనవసర రాద్ధాంతం చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ చేసే చర్యల వల్ల ఇప్పటికే ఇండియాలోని చాలామంది మరణించారు. అలాగని ఇండియా ఊరుకోదు కదా.. పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీస్తుంది. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో  పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై  దాడి చేసి ఎంతోమంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో  పాకిస్తాన్ చేసుకున్నటువంటి తప్పులకు వారే శిక్ష అనుభవించే పరిస్థితులు ఏర్పడ్డాయి.. అక్కడ ఏం జరుగుతోంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. 

పాకిస్తాన్ లో ఓ పక్క సైనిక అధికారి,మరో పక్క ప్రధానమంత్రి, ఇంకోపక్క క్రికెటర్లు అంతా కలిసి పాకిస్తాన్ చేస్తున్న చర్యలను అద్భుతంగా చూపిస్తూ ప్రజలను ఏ మార్చే పనిలో పడ్డారు. కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం వీరిని అస్సలు పట్టించుకోవడం లేదు. సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బెలూచ్ ప్రజల తిరుగుబాటు,సింధు ప్రాంత తిరుగుబాటు, , పిఓజేకే ప్రాంత తిరుగుబాటు అంతా కలిసి పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. వీటన్నింటిని దారి మళ్లించడం కోసమే భారత్ తో ఏదో ఒక రకంగా గెలుక్కొని యుద్ధంలాంటివి చేసి ప్రజల తిరుగుబాటులను ప్రక్కుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. దీని కోసమే తీవ్రవాదులను పెంచి పోషించి వారిని మన దేశంపై ఉసిగొలుపుతోంది. ఇప్పుడు అదే తీవ్రవాదం పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది.  

చేసిన పాపాన్ని చెప్పుకుంటే పోతుంది అంటారు. కానీ పాకిస్తాన్ ఎంత నష్టపోతున్నా ఆ విషయాలను బయట చెప్పకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. మన దేశంపై ఏ విధమైన ఉగ్రవాద దాడులు చేపించిందో ఆ విధంగానే పాకిస్థాన్పై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. అక్కడ సైన్యాన్ని ఉగ్రవాదులు అతలాకుతలం చేస్తున్నారు. భారత్ పై దాడి చేయించడం కోసం లష్కరి తోయిబా, జైషా మహమ్మద్ ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్ సైన్యం ఐఎస్ఐ ఏ విధమైన శిక్షణ ఇచ్చి మన దేశంపై దాడి చేయించిందో, ఆ విధమైన దాడులే ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంపై జరుగుతున్నాయి. దీంతో వారు చేసిన తప్పు మళ్లీ వారి వైపే ఎఫెక్ట్ చూపెట్టింది.. అంటే ఎవరు చేసిన కర్మ మళ్లీ వారికే చుట్టుకుంటుంది అనేది పాకిస్తాన్ విషయంలో నిజమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: