కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 12 శాతం శ్లాబ్‌లో మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆర్థిక భారం పడనుందని తెలుస్తోంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను  తొలగించే పరిస్థితి వస్తే  ఆ శాతాన్ని 5 శాతానికి  తగ్గించే  ఛాన్స్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయనున్నారని సమాచారం అందుతోంది.  ఈ నిర్ణయాన్ని వస్తువుల  వినియోగాన్ని  పెంచే దిశగా  అడుగులు పడనున్నాయని భోగట్టా.  ఈ నిర్ణయం అమలు ద్వారా   జీఎస్టీ వసూళ్లు  సైతం పెరిగే  ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  సైతం గత కొంతకాలం నుంచి జీఎస్టీ తగ్గింపు గురించి సైతం కొన్ని సూచనలు  చేసిన సంగతి తెలిసిందే.  ఈ నిర్ణయం ద్వారా వ్యవసాయ పరికరాలు,  వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్,  500 - 1000 రూపాయల మధ్య  ఉన్న  పాదరక్షలు, స్టేషనరీ ఐటమ్స్.  1000 కంటే ఎక్కువ విలువైన బట్టలు,  సైకిల్స్, తక్కువ కెపాసిటీ ఉన్న  వాషింగ్ మెషిన్ల ధరలు తగ్గనున్నాయి.

గీజర్లు,  ఐరన్ బాక్స్ లు,  కుట్టు మిషన్లు,  టూత్ పేస్ట్,  గొడుగులు, కుట్టు మిషన్లు తగ్గనున్నాయి.  వస్తువుల ధరలు తగ్గితే.. అమ్మకాలు పెరుగుతాయని కేంద్రం  భవిస్తుండగా  కేంద్రం అంచనాలు నిజమవుతాయా లేదో చూడాల్సి ఉంది.  మధ్య తరగతి కుటుంబాలకు ఊరట నిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయేమో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: