ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాహేతర సంబందిత హత్యలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కొంతమంది వివాహమైన మొదటి రోజే తమ భర్తలను చంపి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిన సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా పాకిస్తాన్లోని ఉండే ఒక యువతి తనకు ఇష్టం లేని వివాహం ఫిక్స్ చేశారని ఆ యువతి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.. ముఖ్యంగా తన కుటుంబంలో ఏకంగా 27 మందికి విషం పెట్టిందట..


పాకిస్తాన్లో ముజఫార్గడ్ ఉండే ఆసియా బిబి తమ కుటుంబ సభ్యులు తాగేటువంటి పాలలో ఎముకలు మందు కలిపి మరి వాటిని తాగించే ప్రయత్నం చేసింది. అయితే గతంలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని తనతోనే వివాహం చేసుకుంటానని ఆసియా బిబి  కుటుంబ సభ్యులను హెచ్చరించిందట. తన బావ అజ్మద్ తో మ్యారేజ్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా దీనిని బ్రేక్ చేసేందుకు ఆమె ఎక్కడికైనా వెళ్తానని హెచ్చరించిందట. అయితే కుటుంబ సభ్యులు తల్లితండ్రులు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.


అలా తనని పెళ్లి చేసుకోబోయే అజ్మద్ తో సహా ఏకంగా అందరికీ విషయం కలిపిన పాలు ఇచ్చింది.. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆసుపత్రి పాలు అయ్యారు. ఇందులో అజ్మద్ తో సహా 18 మంది తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు.. ఇందులో అజ్మద్, అన్నలు వదినలతో సహా మొత్తం మీద 9 మంది మరణించినట్లుగా సమాచారం. అయితే ఈ సంఘటన గత ఏడాది జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ విషయం గురించి విషయాలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇదే కేసులో ఆసియా తన లవర్ షాహిద్ హస్తం కూడా ఉందని పోలీసులు కూడా వీరిద్దరిని అదుపులోకి తీసుకొని మరి విచారించగా పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. కానీ తను బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం ఏకంగా ఇలాంటి ఘటన  అక్కడి ప్రజలను ఇప్పటికీ భయభ్రాంతులకు గురిచేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: