
జయలలిత వంటి పేరు వీరిలో ఎవరికీ కూడా లేకపోవడం ఇటు స్టాలిన్ వచ్చేటప్పటికీ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడంతో పాటుగా స్టాలిన్ తర్వాత ఉదయినిది స్టాలిన్ పేరు కూడా బాగా వినిపించడం వంటివి జరుగుతున్నాయి. జయలలిత కూడా సినీ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టింది కాబట్టి తను కూడా సినిమా వాడిని కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని హీరో విజయ్ దళపతి తనకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ తమిళనాడు ప్రజలను TVK పార్టీ అధినేత విజయ్ అడుగుతున్నారు. అయితే ఈ విషయంలో ఏఏడిఎంకే పార్టీని కూడా సపోర్ట్ చేయాలని అడగగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పార్టీ పన్నీరు సెల్వాన్ని పక్కనపెట్టి పలని స్వామి ఆల్రెడీ ఉండడంతో ఈయనకు మద్దతు ఉన్నది.
అలాంటి పలని స్వామి టీవీకే అధినేత విజయ్ ని ఎందుకు సీఎంగా ఒప్పుకుంటారు?. అయితే ఈ విషయంపై ఎవరు ఒప్పుకోకపోవడంతో భారతీయ జనతా పార్టీని బ్లెమ్ చేసి.. బిజెపి కారణంగానే తన కూటమికి నాయకత్వం వహించట్లేదంటూ తెలియజేశారు. అందుకే తాను సింగిల్ గా ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తానంటూ తెలిపారు విజయ్. గతంలో జయలలిత, కరుణానిధి, ఎంజీఆర్ లాంటి వాళ్లకి మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత రోజుల్లో వచ్చినటువంటి హీరో కమలహాసన్ పొలిటికల్ పార్టీ పెట్టి నిరాశపరిచారు. హీరో విజయ్ కాంత్ కూడా పార్టీ పెట్టి కేవలం ఒకే ఒక్క సీటు గెలిచారు. ఆ తర్వాత పొత్తు పెట్టుకుని మరి 30 సీట్ల వరకు గెలిచి మంత్రి అయ్యారు. శరత్ కుమార్ ఇలా ఎంతోమంది పెట్టిన వర్కౌట్ కాలేదు.
హీరో విజయ్ కి కూడా మాస్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత మేరకు క్రేజీ ఉందని చెప్పవచ్చు. డీఎంకే, ఐడిఎంకెలను దాటి ముఖ్యమంత్రి అయ్యేటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ కనిపించలేదట. 2026 మొదటిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే విజయ్ ను ముఖ్యమంత్రిగా టీవీ కె పార్టీ ప్రకటించింది. విజయ్ దెబ్బ ఏఏడిఎంకే, బిజెపి కూటమిని దెబ్బతీస్తుందా.. టీఎంకే కూటమిని దెబ్బతీస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.