
ఇక ఈ 70 కొత్త అన్న క్యాంటీన్ ల భవనాల నిర్మాణం పనులు సైతం ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తుంది .. వచ్చే డిసెంబర్ నాటికి వీటిని రెడీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు .అయితే ఒక్కో అన్నా క్యాంటీన్ భవనానికి 6 లక్షలు చొప్పున మొత్తం 41.70 లక్షలు ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .. 2026 జనవరి నుంచి ఈ కొత్త అన్న క్యాంటీన్ లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి . కొత్తగా మొదలు పెట్టిబోయే 70 అన్నా క్యాంటీన్ లతో ప్రభుత్వం ప్రజలకు అందించే భోజనం పై రాయితీ భారం ప్రతి సంవత్సరం 45.07 కోట్లుగా ఉంటుందని కూడా అంచన్న వేస్తున్నారు .. ప్రస్తుతం నిర్వహిస్తున్న 113 క్యాంటీన్లో రోజు మూడు పూటలా మొత్తం 1,84,500 మంది ఆహారం తింటున్నారు .. ఇలా ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద 75 రూపాయలకు ఖర్చుగా వస్తుంది .. టిఫిన్ పై 17 ,మధ్యాహ్నం భోజనం పై 29, రాత్రి భోజనం పై 29 చొప్పున ప్రభుత్వం భరిస్తుంది .
ఇక మరి జిల్లాల వారీగా కొత్తగా ప్రారంభించబోయే అన్న క్యాంటీన్లో వివరాలు ....శ్రీకాకుళం: 5 పార్వతీపురం మన్యం: 1 విజయనగరం: 3 అల్లూరి సితారామరాజు: 3 అనకాపల్లి: 3 అంబేడ్కర్ కోనసీమ: 3 తూర్పు గోదావరి: 4 పశ్చిమ గోదావరి: 3 కాకినాడ: 2 ఏలూరు: 4 గుంటూరు: 5 పల్నాడు: 1 ఎన్టీఆర్: 1 కృష్ణా: 3 ప్రకాశం: 4 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: 3 తిరుపతి: 2 చిత్తూరు: 7 అనంతపురం: 3 శ్రీ సత్యసాయి: 1 కర్నూలు: 4 నంద్యాల: 1 వైఎస్ఆర్ కడప: 1 అన్నమయ్య: 3.. ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ లు ఎక్కువగా పట్టణ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి .. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూల్, అనంతపురం నగరాల్లో ఐదు నుంచి పది వరకు క్యాంటీన్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా కేటాయించిన 70 క్యాంటీన్లను ఎక్కువగా గ్రామీణ నియోజకవర్గాల్లోనే అధికంగా ఏర్పాటు చేయనున్నారు.