
ముఖ్యంగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన ఇద్దరు విద్యార్థులని ఏకంగా విమానం ఎక్కించి, విశాఖపట్నం టూర్‌కు తీసుకెళ్లారు .. అలాగే వారి గొప్ప ప్రదర్శనను పర్యాటక ప్రదేశాలతో వారిని అభినందించారు .. ఆ ఇద్దరు కూడా గవర్నమెంట్ బడిలో చదివి టాపర్లుగా అత్యధిక ర్యాంక్ సాధించారు .. బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన పాగల రసిత , శ్రీమంతుల రోహిత పదో తరగతి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ఆ మండలంలోనే టాపర్లుగా నిలిచారు .. రసిత 558, రోహిత 557 మార్కులు సాధించారు .
ఇలా ఈ విద్యార్థుల గొప్ప విద్య ప్రదర్శనకు ఎంతో ఆనందించినా పాఠశాల హెడ్ మాస్టార్ మల్కా రామ్‌కిషన్ రావు తన సొంత డబ్బులతో ఆదివారం వారిని విమానంలో విశాఖపట్నం టూర్ కు తీసుకువెళ్లి పర్యాటక ప్రదేశాలను చూపించి తీసుకువచ్చారు .. ఇలా హెడ్ మాస్టార్ వినూత్న ఆలోచనకు అందరూ తెగ పొగిడేస్తున్నారు .. అలాగే విద్యార్థులు ప్రతిబను గుర్తించి వారిని ప్రోత్సహించినందుకు బేగంపేట నివాసితులు రామ్‌కిషన్ రావు మాస్టారును ఎంతగానో అభినందించారు .. అలాగే విద్యార్థులను ఇలా ప్రోత్సహించడం ద్వారా పదోతరగతిలో 100% ఫలితాలు అందుకోవడానికి హెడ్ మాస్టర్ మల్కా కిషన్ రావు కూడా తన వంతు కృషి అందించారు .