ప్రస్తుతం దేశంలో ఎక్కువగా జమిలి వాతావరణానికి అనుకూలిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెమిలి ఎన్నికల కోరిక మేరకు కేంద్రం కూడా బిజెపి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి ఎన్నికైన సందర్భంగా వీటిని అమలు చేసేలా చూస్తోంది. 2014లో మొదటిసారి మోడీ నాయకత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నోళ్లుగా జెమిలి ఉసేఎత్తుతూనే ఉంది  కేంద్ర ప్రభుత్వం. జెమిలికి అన్ని అవాంతరాలు కూడా పూర్తిగా తొలగిపోయిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు సిద్ధం చేసింది. జెమిలి ఎన్నికల కోసం 2022 ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చేశారు.


ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి మిత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం జెమిలికి కొంత మేరకు వ్యతిరేకత ఉన్నది.బిజెపి మిత్రులుగా ఉన్న రాష్ట్రాలలో మాత్రం జెమిలి ఎన్నికలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కొన్ని పార్టీలు మాత్రం పెండింగ్  పెట్టారట. అయితే మరి కొంతమంది న్యాయవాదులు జెమిలి ఎన్నికల పైన పలు రకాల సందేహాలను  తీసుకువస్తున్నారు. జెమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం అవినీతి పెరిగిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం తెలపాలంటూ న్యాయవాదులు అడుగుతున్నారట.


ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో మాజీ రాష్ట్రపతి అద్వయనంలో చేసిన కొన్ని నివేదికలను కూడా పంపించారట. వాటిని అనుసరించే తాము జమిలి ఎన్నికల మీద ఆలోచిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. ఈ నివేదికలన్ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జమిలి ఎన్నికలకు సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి.. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పాలనకు ఆటంకం ఏర్పడదని ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తోందట. పదేపదే దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి సాఫీగా సాగలేదు అంటూ కేంద్రం ఆలోచనకు కూడా సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచిందట.


మొత్తం వ్యవహారాన్ని విన్న తర్వాత జెమిలికి సుప్రీంకోర్టు కూడా సరే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈనెల 21 నుంచి ఆగస్టు 21 దాకా సాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ఆమోదించడం ద్వారా కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇక దేశంలో జమిలి ఎన్నికలకు కౌన్డౌన్ మొదలైనట్లుగానే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం బిజెపి పార్టీ హవ ఎక్కడ చూసినా కూడా ఉండడంతో జెమిలి ఎన్నికలకు పట్టుబడినట్లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి వ్యూహాలను కూడా ఇప్పటినుంచే రచించినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: