ఒకప్పుడు సినిమాలు చూడాలంటే తప్పకుండా థియేటర్లోకి వెళ్లేవారు. లేదంటే ఆ సినిమా థియేటర్లలో వచ్చిన సంవత్సరానికో ఆ తర్వాత కాలంలో టీవీల్లో వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ అయింది అంటే థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంటే కొన్నాళ్లపాటు థియేటర్లలో చూడొచ్చు. ఒకవేళ ప్లాప్ అయ్యిందంటే  సామాజిక మాధ్యమాల్లోకి వచ్చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలను ఓటిటి ప్లాట్ ఫామ్ లు కూడా కొనేసి ప్రసారం చేస్తున్నారు. చాలామంది కొత్త కొత్త సినిమాలు కూడా ఓటిటిల్లో  చూస్తున్నారు. అయితే ఓటిటిలో సినిమా చూస్తే అడల్ట్ కంటెంట్ తొలగించాల్సిన అవసరం ఉండదు. దీంతో చాలామంది ఓటీటీలను అడ్డుగా పెట్టుకొని  బూతు సినిమాలు తీస్తూ ప్రసారం చేస్తున్నారు.

 అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.. అడల్ట్ కంటెంట్ కలిగినటువంటి ఓటిటి ప్లాట్ ఫామ్ లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మరి ఆ ఓటీటీ సంస్థలు ఏంటి ఆ వివరాలు చూద్దాం.. కేంద్ర సమాచార మంత్రి తాజాగా  ఓటిటి సంస్థలపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 యాప్ లపై నిషేధం విధించింది. ఈ వెబ్ సైట్ లను కనబడకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఇది ఉల్లంఘిస్తే చట్ట పరంగా వారిపై   చర్యలు ఉంటాయని హెచ్చరించింది.. ఇందులో ఏ ఎల్టిటి, దేశీ ఫ్లిక్స్, బిగ్ షార్ట్స్, నవరసాలైట్, గులాబ్ యాప్, అంగన్ యాప్, బుల్లి యాప్, జాల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఫ్రైమ్, షో ఎక్స్, షోల్ టాకీస్, అడ్డ టీవీ, విఐపి, హల్చల్ యాప్, మూడ్ ఎక్స్, నియాన్ ఎక్స్, మోడ్ ఫిక్స్, ట్రైప్లిక్స్ ఇలా మరికొన్ని అడల్ట్ కంటెంట్ కలిగినటువంటి వెబ్సైట్ యాప్ లను కేంద్ర ప్రభుత్వం  తొలగించింది.

అయితే ఈ తొలగింపు తర్వాత ఈ యాప్ లను ఎవరైనా వాడినా లేదంటే ఇలాంటి కంటెంట్ ని యూజ్ చేసినా వారిపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేసింది. ఈ విధమైన ఓటీటీల ద్వారా చాలామంది స్కూల్ ఏజ్ పిల్లలు చెడిపోతున్నారని, అడల్ట్ వీడియోల వైపు అలవాటు పడుతున్నారని అన్నది. పిల్లల్ని సక్రమమైన దారిలో పెట్టాలి అంటే తప్పకుండా ఇలాంటి బూతు కంటెంట్ ఉన్నటువంటి ఓటీటీలను తొలగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార శాఖ తెలియజేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: