ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిలలతో జరిగిన ఆస్తి వివాదంలో న్యాయపరంగా ఘన విజయం సాధించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఈ కేసులో జగన్ వాదనలకే మద్దతు తెలుపుతూ తల్లి–చెల్లితో ఆస్తి షేర్ల బదిలీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. షర్మిలపై ప్రేమ తగ్గిందా? .. జగన్ వాదన ప్రకారం... 2019లో రాజకీయంగా ఆత్మీయంగా ఉన్న సమయంలో, తన సోదరి షర్మిలకు ప్రేమతో కొన్ని ఆస్తుల్లో వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా సరస్వతి పవర్ కంపెనీలోని షేర్లను విజయలక్ష్మి గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారు.


అయితే తర్వాత రాజకీయంగా షర్మిల వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించి ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలైంది. దీంతో షర్మిలపై తనకు ఉన్న ఆప్యాయత తగ్గిందని, అందుకే గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకోవాలని ఎన్‌సీఎల్టీకి జగన్ పిటిషన్ వేశారు.విశ్లేషణాత్మకంగా ఎన్సీఎల్టీ తీర్పు ... విజయమ్మ, షర్మిల వాదనలు సమర్ధించకపోయినా, ఎన్సీఎల్టీ జగన్ వాదనలను విశ్లేషిస్తూ... సరస్వతి పవర్ షేర్ల బదిలీపై స్టే విధించింది. ఇది నేరుగా విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ఉన్నప్పటికీ, షేర్ల బదిలీకి లీగల్ క్లారిటీ అవసరం ఉందని భావించింది. ఇదే ఇప్పుడు జగన్‌కు బలం .. ఈ తీర్పుతో జగన్ మళ్లీ తన ఆస్తుల్లో పూర్తి నియంత్రణను కొనసాగించనున్నారు. ఎన్‌సీఎల్టీ తీర్పు నేపథ్యంలో విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించవచ్చన్న సమాచారం ఉంది.

 

అయితే ఇది జగన్‌కు న్యాయపరంగా, వ్యక్తిగతంగా కూడా విజయంగా భావించవచ్చు. పెరుగుతున్న కుటుంబ అంతర్మథనం .. వైఎస్ కుటుంబంలో రాజకీయాలు కలిసొచ్చినప్పటి నుంచి బంధాలు దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు. తల్లి, చెల్లి – ఇద్దరితోనూ విభేదాలు వచ్చినా, ఈసారి నేరుగా కోర్టు వరకు వెళ్లడం... వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుల మధ్య విభేదాలు ఎంత తీవ్రమయ్యాయో సూచిస్తోంది. జగన్ వ్యూహాత్మకంగా కోర్టును ఆశ్రయించి, శాంతంగా ఓ కీలక నిర్ణయాన్ని తనవైపుగా మలచుకున్నాడు. ఇది కేవలం ఆస్తి వివాదమే కాకుండా, రాజకీయంగా షర్మిలకు పరోక్షంగా ఎదురుదెబ్బగా అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: