
అదే సమయంలో పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసే లఖ్ నవు మెట్రో ఫేజ్ 1 బి నిర్మాణానికి సైతం ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 5801 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు 700 మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టం గణనీయంగా ఊపందుకున్న సమయంలో ఈ నిర్ణయం అమలులోకి రావడం కొసమెరుపు.
దేశంలో ఇప్పటికే ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ వేర్వేరు దశల్లో ఉండగా తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్ట్స్ తో వీటి సంఖ్య 10కు చేరిందని తెలుస్తోంది. 2034 సంవత్సరం నాటికి నైపుణ్యం కలిగిన వాళ్లకు మరింతగా ఉపాధి అవకాశాలు లభించేలా చేసే విషయంలో ఇవి కీలకంగా మారనున్నాయని సమాచారం అందుతోంది. ఈ నిర్ణయం పరోక్షంగా ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కు భారీ గిఫ్ట్ ప్రకటించి మోడీ లబ్ది చేకూర్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు