
అన్నదాత సుఖీభవ నిధుల జమ కోసం రైతులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా అందితే రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ రెండో విడత మరో నాలుగు నెలల తర్వాత రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రెండో విడతలో కూడా 5,000 రూపాయలు జమ చేయనున్నారని మూడో విడతలో 4,000 రూపాయలు జమ చేయనున్నారని తెలుస్తోంది.
అన్నదాత సుఖీభవ స్కీమ్ రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ గతేడాది ఈ నగదును జమ చేయలేదనే సంగతి తెలిసిందే. రైతుల విషయంలో కూటమి సర్కార్ మరింత జాలి, దయ, కరుణతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి సర్కార్ పై ఉందనే సంగతి తెలిసిందే. రైతులు దిర్ఘకాలంలో ప్రయోజనాలు పొందేలా కూటమి సర్కార్ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు