ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం విషయంలో ఊహించని స్థాయిలో వృద్ధి చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. కూటమి అనుకూల పత్రికల కథనాల ప్రకారం స్టాంపుల, రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయంలో ఏకంగా 39 శాతం వృద్ధి నమోదు జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ వృద్ధి చోటు చేసుకుందని సమాచారం. 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు 12 వరకు 2850 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తే ఈ ఏడాది అదే కాలంలో ఆదాయం 3950 కోట్ల రూపాయలకు పెరగడం కొసమెరుపు.

గతేడాది ఆదాయంతో పోల్చి చూస్తే  ఈ ఏడాది 1099 కోట్ల రూపాయల ఆదాయం పెరగడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు, స్థలాల మార్కెట్ విలువ పెరగడంతో ఆదాయంతో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుందని తెలుస్తోంది.  750 కోట్ల ఆదాయం పెరగాలని రెవిన్యూ శాఖ అంచనా వేయగా అంచనాలను మించి ఆదాయం పెరగడం కొసమెరుపు.

మొదటి త్రైమాసికంలో 436 కోట్ల రూపాయల రాబడి నమోదు కాగా  ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రికార్డ్ స్థాయిలో  ఆదాయం నమోదు కాగా జులై, ఆగష్టు నెలల్లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.  మెజారిటీ నెలల్లో వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని  చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం అవసరమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ  రాజకీయాల్లో  చంద్రబాబు ప్రస్థానం ప్రత్యేకం అని సోషల్ మీడియాలో  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే  రోజుల్లో  రాష్ట్రం మరింత అభివృద్ధి చెందితే బాగుంటుందని చెప్పవచ్చు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: