
పెద్ద సంఖ్యలో ఓట్లు కాకపోయినా.. ఆ సపోర్ట్ ప్రతీకాత్మకంగా బీజేపీకి మద్దతు దక్కినట్టే అవుతుంది. ఇదే సమయంలో మరో ప్రశ్న ఎత్తి చూపబడుతోంది – బీజేపీ, భారత రాష్ట్ర సమితిని (బీఆర్‌ఎస్) సంప్రదించలేదా ? తెలంగాణకే పరిమితమైన బీఆర్‌ఎస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎలాంటి అజెండా లేకుండా ఉందనే విమర్శలు ఉన్నాయి. లోక్‌సభలో ఎవరూ లేని ఈ పార్టీకి, రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు ఉన్నారు. నాలుగు ఓట్లు పెద్దగా తేడా చేయకపోయినా.. బీజేపీకి ఒక కౌంటర్ గ్యారెంటీ లాంటివి అవుతాయి. అయినా సరే, ఇప్పటివరకూ బీఆర్‌ఎస్ వైపు నుంచి ఏదైనా ‘మద్దతు’ లేదా ‘ప్రతిఘటన’ సంకేతాలు వెలువడలేదు. ఇప్పటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను సపోర్టు చేయలేరు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలనను వారు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు .
అదే సమయంలో బీజేపీకి నేరుగా మద్దతు ఇవ్వడమూ కష్టమే, ఎందుకంటే రాష్ట్రంలో ఆ పార్టీతో ఘర్షణాత్మక రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ గ్యాప్ వల్లే బీఆర్‌ఎస్ నేతలు "ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలి" అనే లైన్‌లోనే ముందుకు సాగుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఎన్నిక ఏకగ్రీవం కాకపోతే.. బీఆర్‌ఎస్ రెండు పార్టీలకూ దూరంగా ఉంటూ వోటింగ్‌కి హాజరుకాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే బీజేపీకి కూడా ఎలాంటి నష్టం జరగదు, బీఆర్‌ఎస్‌కీ ఇమేజ్ సమస్య రాదు. జగన్ వైసీపీ నుంచి బీజేపీకి గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయమని అనిపిస్తుండగా.. బీఆర్‌ఎస్ మాత్రం మౌనంగా ఉండి మరోసారి "వేరే మార్గం లేదు" అనే పొజిషన్‌లోకి వెళ్ళింది. రాజకీయ లెక్కలు వేసుకుంటే.. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పెద్ద పోటీ లేకుండా ముగిసే ఛాన్స్ కనిపిస్తోంది.