ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక పాలన చేయాలని ఎవరూ కోరుకోకపోయినా కొన్నిసార్లు చిన్నచిన్న తప్పులు ప్రజల్లో చెడ్డ పేరును తెచ్చిపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకతకు కారణాలేంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.  ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రధానంగా అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నారు.  అయితే సీనియర్ నేతల్లో నారా లోకేష్ పై ఒకింత అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే.  పట్టణాల్లో కూటమి సర్కార్ పై వ్యతిరేకత లేకపోయినా గ్రామాల్లో ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది.

పథకాల అమలు విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సైతం ఇందుకు కారణమని చెప్పవచ్చు.  కొందరు కూటమి నేతలు మహిళలతో ప్రవర్తిస్తున్న తీరు ప్రజల్లో కూటమిపై వ్యతిరేకత ఏర్పడటానికి కారణమవుతోంది.  కొందరు అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతి కూడా ఇందుకు కారణమవుతోందని కచ్చితంగా చెప్పవచ్చు.  వికలాంగుల పింఛన్ల కోత  దిశగా కూటమి సర్కార్ అడుగులు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కనీసం 40 శాతం వైకల్యం ఉండాలనే నిబంధన  వల్ల  చాలామంది ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ ను కోల్పోవడంతో పాటు ప్రభుత్వంపై  వ్యతిరేకత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  మెగా డీసికి సంబంధించి వైరల్ అవుతున్న పలు కథనాలు కూడా  ప్రజల్లో వ్యతిరేకతను ఊహించని స్థాయిలో పెంచుతుండటం సంచలనం అవుతోంది.  ఈ వ్యతిరేకతపై కూటమి సర్కార్ దృష్టి పెడితే మంచిది.


 వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: