
ఇక వ్యాపార రంగంలో కూడా అవినీతి విస్తరించి పోతుందని అడుసుమిల్లి వ్యాఖ్యానించారు. వైన్ షాప్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధికారుల వేధింపులకు గురవుతున్నారు అని ఆయన అన్నారు. “ప్రతి అడుగులోనూ పర్మిషన్ కోసం, ప్రతి ఫైలులోనూ సంతకం కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారం చేసే హక్కు కూడా ప్రజలకు దక్కట్లేదు. చిన్న స్థాయి వ్యాపారులు బిక్కచచ్చే పరిస్థితికి చేరుకుంటున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చలో ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. “అవినీతిని ఎదుర్కోవడం కోసం ప్రజలు మౌనంగా ఉండకూడదు, పోరాడాలి” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజలే ముందుకు రావాలని, అవినీతి అధికారులను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అడుసుమిల్లి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం చర్చపరిమితి కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద హడావుడి రేపాయి. ప్రతిపక్షం ఈ వ్యాఖ్యలను తమ వాదనకు బలం చేస్తూ ఉపయోగించుకోనుంది. ఇక అధికర పార్టీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం ఖాయం. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ అంశంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి అడుసుమిల్లి వ్యాఖ్యలు ప్రస్తుత పాలనపై ఒక పెద్ద సవాల్ విసిరాయి. ఆయన మాటల్లో ఉన్న ఆగ్రహం, నిజాలు, ప్రజల మనసులో ఉన్న అసంతృప్తికి ప్రతిబింబం కావడం వల్ల ఈ చర్చ మరింత హీట్ పెంచింది.