
నమ్మకానికి మరో పేరుగా, "కేరాఫ్ అడ్రస్"గా ఖ్యాతి పొందిన చంద్రబాబు నాయుడు, నేటికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన రకరకాల వార్తలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, టిడిపి అభిమానులు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ ఆయన గొప్పతనం గురించి వివరంగా చెబుతున్నారు. 29 ఏళ్ల క్రితం, 1995 సెప్టెంబర్ 1న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో మరే రాజకీయ నాయకుడికి లేని క్రేజీ పాపులారిటీ చంద్రబాబుకే ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరించినా, ప్రజలకు సేవ చేయాలనే తన నిర్ణయాన్ని ఆయన ఎప్పుడూ మార్చుకోలేదు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనూ చంద్రబాబు నాయుడు సృష్టించిన రికార్డు ప్రత్యేకమైంది. 1995 ఆగస్టులో టిడిపి లోపల పెద్ద రాజకీయ సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో పార్టీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. ఈ తిరుగు బాటలో చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సంపాదించి, చివరకు ఆయన అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రిగా అయ్యారు.
ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 45 సంవత్సరాలు మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా అవతరించిన అతి తక్కువ వయస్సు రికార్డు. దేశ చరిత్రలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఇంత చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. చంద్రబాబు నాయుడు సృష్టించిన ఈ రికార్డు రాష్ట్ర రాజకీయాలకే కాకుండా దేశ రాజకీయాలను కూడా ఎప్పటికీ సెన్సేషన్‌గా నిలిపింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద స్థానానికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న అద్భుతమైన ఆర్గనైజేషన్ నైపుణ్యం. పార్టీని బలోపేతం చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయాలే ఆయనను స్టార్ విజనరీ లీడర్‌గా ముందుకు నడిపించాయి అని రాజకీయ ప్రముఖులు ప్రశంసిస్తుంటారు.