బీఆర్ఎస్ పార్టీలోని నాయకులపై కవిత చేసిన ఆరోపణల కారణంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ సస్పెండ్ చేసిన 24 గంటలకి కవితప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హరీష్ రావు వల్లే ఇదంతా జరుగుతోందని, హరీష్ రావు మా ముగ్గురిని విడగొట్టాలని ఇలా చేస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో హరీష్ రావు నన్ను,నాన్నని, అన్నని ఓడించాలని చాలామందికి డబ్బులు పంచారు. అన్న ఓటమి కోసం సిరిసిల్లకు 60 లక్షలు పంచారు. 

అలాగే కాళేశ్వరంలో వచ్చిన డబ్బులతో హరీష్ రావు ఎంతోమంది ఎమ్మెల్యేలను కొన్నారు. ఎందుకంటే ఒకవేళ పార్టీ నుండి కాస్త అటు ఇటుగా విమర్శలు వస్తే ఆయన పార్టీ నుండి బయటికి వెళ్లినా ఆ ఎమ్మెల్యేలంతా ఆయనతో ఉండాలి అని ఇలా చేశారు.కాళేశ్వరం విషయంలో రేవంత్ తో హరీష్ రావుకి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. అందుకే రేవంత్ సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు నన్ను పార్టీలో నుండి తీసేసారు. రేపు అన్నకు తర్వాత నాన్నకి అదే పరిస్థితి తీసుకువస్తారు.అన్నని నువ్వే కాపాడాలి నాన్న.. హరీష్ రావు నుండి కేటీఆర్ కి ముప్పు ఉంది.

రేపు నాలాంటి ప్రమాదమే అన్నకి కూడా రాబోతుంది అన్నని కాపాడుకో.. అలాగే ఎవరు ఎన్ని చేసినా మా రక్తసంబంధం తెగిపోదు.. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్. ఆయన చేతుల్లోకి పార్టీ రావాలని చూస్తున్నారు.. 20 ఏళ్లుగా నాకు బీఆర్ఎస్ తో అనుబంధం ఉంది.ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేసింది బాధగా ఉన్నా కూడా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాను.. అంటూ హరీష్ రావు పై విమర్శలు చేస్తూ కేసీఆర్ కేటీఆర్ ని వేడుకుంటున్నట్లుగా కవిత మాట్లాడింది. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: