కృష్ణా, గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం జనసేనపై కుల రాజకీయాలు చేసేందుకు ప‌క్కా ట్రాప్‌కు దిగుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొడుతూ ప్ర‌తి వివాదానికి కులాన్ని తెర‌మీద‌కు తెస్తోంది. ఇలాంటి ప‌రిణామాల‌తో జ‌న‌సేన పార్టీపై ఇత‌ర కులాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న‌దే వైసీపీ గేమ్ ప్లాన్ అని జ‌న‌సేన నాయ‌కులు అనుమానిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవ‌ల్లో జ‌రుగుతోంది వేరు. గ‌తంలో ఆ పార్టీ చేసిన కుల రాజ‌కీయాల వ‌ల్లే వైసీపీకి గోదావ‌రి జిల్లాల్లో చాలా చోట్ల చావు దెబ్బ త‌ప్ప‌లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ఎమ్మెల్యేల‌కు భారీ మెజార్టీలు వ‌చ్చాయి. జ‌గ‌న్ సైతం గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప‌దే ప‌దే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, పెళ్లిళ్ల గురించి చేసిన కామెంట్లు కూడ ఎన్నిక‌ల్లో వైసీపీని చావు దెబ్బ కొట్టాయి.


ఇప్పుడు వ్యూహం మార్చుకోకుండా మ‌ళ్లీ వైసీసీ క్యాస్ట్ ట్రాప్‌లో జ‌న‌సేన‌ను ఇరికించాల‌ని చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించేలా లేవు. దీంతో వైసీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కొంద‌రు వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తూ రెచ్చ‌గొట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తిడితే.. యూట్యూబ్ ల ద్వారా విమ‌ర్శ‌లు చేస్తే జ‌న‌సేన సైనికులు రెచ్చిపోయి ఇత‌ర కులాల వారిని టార్గెట్ చేస్తార‌ని.. అది త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న‌దే వైసీపీ లెక్క‌గా తెలుస్తోంది. కోన‌సీమ‌లో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయం చేసి ల‌బ్ధి పొందాల‌ని భావిస్తున్న‌ట్టుగా జ‌న‌సేన వర్గాలు సందేహం వ్య‌క్తం చేస్తున్నాయి.


అస‌లు ఏ రాజ‌కీయ పార్టీ అయినా అధికారంలో కంటే విపక్షంలో ఉన్నప్పుడు మ‌రింత‌ మరింత బాధ్యతగా ఉండాలి. ఇక అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే
అధికారాన్ని నెత్తికెక్కించుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఫీలింగ్ ప్ర‌జ‌ల్లో వ‌స్తే వారంతా పార్టీకి వ్య‌తిరేకం అవుతారు. అది రాజ‌కీయంగా ఆ పార్టీకి భ‌విష్య‌త్తులోనూ కోలుకోలేని దెబ్బ అవుతుంది. జ‌న‌సేన సైనికుల్లో ఇదే ట్రాఫ్ వేయాల‌ని వైసీపీ భావిస్తోంది. రెచ్చగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. వారిపై దాడులు చేయకూడ‌దు.. సంయ‌మ‌నంతోనే స‌మాధానం చెప్పాలి. వారికి చ‌ట్ట ప‌రంగానే ఆన్స‌ర్ ఇవ్వాలి. ఇలా జ‌న‌సేన వైసీపీ ట్రాప్‌లో ప‌డ‌క‌పోతే మ‌ళ్లీ వైసీపీకే దెబ్బ ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: