మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన పంట నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లాయి. వాహన రాకపోకలు నిలిచిపోయాయి.. ముఖ్యంగా కోస్తా జిల్లాలను మొంథా తుఫాను అనేది అతలాకుతలం చేసింది.. నరసాపురం తీరం వద్ద తాకినటువంటి మొంథా మెల్లగా తీరం దాటి, మళ్లీ వెళ్ళిపోయింది. అయితే ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుందని చాలామంది అనుకున్నారు.. కానీ నష్టం మాత్రం అంతగా ఏమీ జరగలేదు. ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం  జరిగింది. అయితే ఎప్పుడు తుఫాన్ లు వచ్చినా  కొంతమంది అయినా చనిపోయేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు.. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు పని విధానమే అని చెప్పవచ్చు. 

రాత్రింబవళ్లు తాను నిద్రపోకుండా తన ప్రజా ప్రతినిధులను కూడా నిద్ర పోనివ్వకుండా అధికారులను అలెర్ట్ చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిక్షణం తుఫాను ముగిసే వరకు అలర్ట్ గా ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ప్రజలకు తెలుసు. అందుకే తానే పూర్తిస్థాయిలో పనిలో ఉంటే అధికారులు కూడా పనిలో ఉంటారని భావించి తాను ఆర్టిజిఎస్ ద్వారా ప్రతి సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నానంటూ సాంకేతం కూడా పంపించారు. దీంతో అధికారులు క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు కావలసిన సాయం అందించారు. వరదల బీభత్సం ఎక్కువగా ఉన్న దగ్గర వందలాది మంది ప్రజలను పునరావాసా శిబిరాలకు పంపారు. ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ నష్టం జరగకుండా చూసుకున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు నిద్రపోలేదు అధికారులకు కూడా నిద్రపోనివ్వలేదు.. ఏదైనా ప్రాంతం దగ్గర సహాయం కావాలని ఫోన్ వస్తే చాలు క్షణాల్లో అక్కడ అధికారులు వాలిపోయేలా అన్ని రకాల ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా విజయవాడ ప్రాంతాల్లో బుడమేరు విషయంలో తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉండడంతో ప్రజలకు వాస్తవ సమాచారం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు.. ఉద్యోగులను అలర్ట్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు.. అయితే చంద్రబాబు ఇంత పని చేసినా కానీ కొంతమంది మాత్రం ఆయన ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తారని సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు.. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ప్రజలపై ఎక్కువగా పడకుండా చాలావరకు ఆపగలిగారని చెప్పవచ్చు.. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబును చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: