టాలీవుడ్ హీరో నారా రోహిత్ , ప్రముఖ హీరోయిన్ శిరీషతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ప్రతినిధి 2 చిత్రంలో కలిసిన నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగి ఆ స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అనుమతితో గత ఏడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేస్తున్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం హైదరాబాదులో చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కొత్త జంటకు పలువురు అభిమానులు, ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా నారా రోహిత్ పెదనాన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వివాహాన్ని చాలా దగ్గరుండి జరిపించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి , కుమారుడు నారా లోకేష్ తో సహా పలువురు సిని ,రాజకీయ ప్రముఖులు సైతం నారా రోహిత్  వివాహానికి హాజరయ్యారు. నారా రోహిత్ ఎవరో కాదు సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే. నారా రోహిత్ చివరిగా భైరవం, సుందరకాండ వంటి చిత్రాలలో నటించారు.


తాజాగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేస్తూ మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు కుమారుడు నారా రోహిత్, శిరీషల వివాహం చాలా అంగరంగ వైభవంగా చేశాము నూతన వధూవరులను ఆశీర్వదించండి అంటూ తెలియజేశారు. అలాగే మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభసందర్భంగా మా కుటుంబానికి ఒక పండుగలాగా మారింది అంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు.పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ సీఎం చంద్రబాబు రాసుకోచ్చారు.. ఇందుకు సంబంధించి ఫోటోలను పంచడంతో అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి నారా రోహిత్  త్వరలోనే రాజకీయ ఎంట్రీ కూడా ఇస్తానంటూ గతంలో ప్రకటించారు. మరి వివాహం అనంతరం ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: