ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున మధ్యాహ్నం తొక్కిసలాట జరగగా ఇందులో 9 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది భక్తులకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ రోజున కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అక్కడ స్థానికులతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలలో ఉండే భక్తులు కూడా భారీ ఎత్తున ఆలయానికి దర్శనం కోసం పోటెత్తారు.


అయితే నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారనే  విధంగా భక్తులు తెలియజేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న  రెయిలింగ్ విరిగి భక్తుల మీద పడడంతో ఒక్కసారిగా ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో తొక్కిసలాటకు దారితీసిందట. అయితే దేవాలయ సామర్థ్యం కేవలం 2 నుంచి 3 వేల వరకు ఉండగా ఈరోజు ఏకంగా 25 వేల మందిపైగా భక్తులు తరలి  రావడంతో ఈ నష్టం జరిగినట్లుగా వినిపిస్తోంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగానే భక్తులు విచ్చేశారు.

ప్రస్తుతం ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వెంటనే ఆలయ అధికారులు సైతం  పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పైన జిల్లా అధికారుల సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఆలయ భద్రత ఏర్పాట్లు కూడా నిర్లక్ష్యం ఉందా అనే విషయం పైన కూడా దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటన పైన ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన అటు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మరి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: