ఓటు రాజకీయాలు ఈ దేశానికి కొత్తేమీ కాదు. ప్రభుత్వం కలిపిస్తున్న సేవలు - సౌలభ్యాలూ ఇలాంటివి ఎన్నికలు సమీపించే కొద్దీ చాలా స్ట్రాంగ్ గా మారుతూ ఉంటాయి. ప్రభుత్వ సేవలు అన్నీ ఉపయోగించుకుని ఖజానా నింపడం మనమందరం రోజూ చేసే పనే. కానీ భారత పౌరుడి మనసులో నాయకులే లేని పోనీ స్వార్ధపు ఆలోచనలు మనస్సులో నాటుతున్నారు అనిపిస్తోంది.

 

 

 

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ - తాగు నీటి బకాయిలు మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసం లో తలసాని , పద్మారావు , జలమండలి అధికారులూ కలిసి చాలా సేపు సమావేశం నిర్వహించిన తరవాత నీటి తో పాటు విద్యుత్ బకాయిలు చెల్లించాలి అని నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు తాగు నీటి బకాయిలు రూ.290 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఒక నాలుగొందల ఇరవై కోట్ల మేర బకాయిలు రద్దు కాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మాఫీ మీద ఉత్తర్వులు కూడా ఇవ్వలేం అని అంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. దాదాపు ఆరు లక్షల మంది గృహాలకి ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రాబోతోంది, మూడు లక్షలమంది కి తాగు నీరు వస్తుంది.

 

 

 

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఓట్ల కోసమే ఇదంతా చేస్తోంది అని ఈజీగా చెప్పచ్చు. బిల్లులు మాఫీ చేసి ఓట్లు దండుకోవడం అనే స్కెచ్ చేసారు అని తెలుస్తోంది. మొన్న ఎన్నికల సమయంలో 'రుణ మాఫీ' దెబ్బకి తెలంగాణా - ఆంధ్ర ప్రదేశ్ లలో తెరాస - తెలుగు దేశం అధికార పార్టీలు గా మారాయి.  ఇలాంటి మాఫీల ద్వారా కొందరికే దక్కుతుందనేది ఎంత నిజమో...భారం అందరిపై పడుతుందనేది అంతే చేదు నిజం.  ప్రతీ ఒక ఎన్నికలకీ ఇలా మాఫీలు చేసుకుంటూ పోతే ఆర్ధికంగా బకాయిలు పెరిగి తడిసి మోపెడు అయ్యి తీరుతుంది.  డబ్బులు కట్టలేని వారికి ఆ అవకాశం ఇవ్వాలే తప్ప డబ్బులు కట్టకుండా ఉండేందుకు ప్రభుత్వమే రాచబాట వేయడం ఏంటో !


మరింత సమాచారం తెలుసుకోండి: