అనగనగా ఓ దేశం ఆ దేశంలో ఓ దీవి ఆ దీవిలో ఓ హోటల్.. ఆ హోటల్ లో మగపురుషులు అడుగుపెట్టడానికి వీలు లేదు. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా అడుగుపెడితే ఇక అంతే సంగతులు శిక్షలు కఠినంగా ఉంటాయి. అలా ఎందుకు.. ఆ హోటల్ ప్రత్యేకత ఏంటి.. ఎందుకని ఆ హోటల్ లోకి పురుషులను అనుమతించడం లేదు.. తెలుసుకుందాం. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ హోటల్ స్పెయిన్ దేశంలో ఉంది.
స్పెయిన్ దేశంలోని బాలెయారిక్ దీవిలో సోమ్ డోనా అనే పేరుతో ఓ హోటల్ ఉన్నది. సోమ్ డోనా అంటే మేము మహిళం అనే అర్ధం ఉంది. అందుకే ఈ హోటల్ లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 14 సంవత్సరాలు నిండిన మహిళలు అక్కడ హాయిగా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దానికి తగ్గట్టుగానే ఆ హోటల్ నియమాలను రూపొందించింది. ఆ హోటల్ లో బసచేసే మహిళలకు సంబంధించిన బంధువులు మహిళలైతేనే హోటల్ లోకి అనుమతి ఉంటుంది.
పురుషులకు మాత్రం నో ఎంట్రీ. మహిళలకు స్వేచ్ఛ కావాలని అందుకే ఆ హోటల్ లో మహిళలకు మాత్రం ప్రవేశం ఉంటుందని హోటల్ యాజమాన్యం తెలియజేస్తోంది. అక్కడ విచిత్రం ఏమిటంటే మొదట అక్కడ పనిచేసే ఉద్యోగులను కూడా మహిళలనే నియమించాలని రూల్ పెట్టుకుంది. కానీ, అక్కడై చట్టాల ప్రకారం ఉద్యోగాల విషయంలో లింగభేదం చూపకూడదు. దీంతో ఆ హోటల్ లో మహిళలతో పాటుగా పురుషులు కూడా పనిచేస్తుంటారు.
కాగా, అక్కడ పనిచేసే పురుషులకు చాలా కఠిన నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అతిక్రమించకూడదు. ఒకవేళ అలా అతిక్రమిస్తే.. దాని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. చుట్టూ అంతమంది మహిళలు ఉన్నప్పుడు ఎందుకు హద్దులు అతిక్రమిస్తాడు చెప్పండి. వాళ్ళను చూస్తూ పనిచేసుకుంటూ పోతాడు. అంతేకదా మరి. ఆ హోటల్ లో పనిచేసే అదృష్టం ఎవరికీ వచ్చిందో మరి.