సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన నటులలో నర్సింగ్ యాదవ్ కూడా ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైల నరసింహ యాదవ్.. సినీ పరిశ్రమలో మాత్రమే ఈయనను నర్సింగ్ యాదవ్ పిలవడం మొదలుపెట్టారు. 1968వ సంవత్సరంలో జనవరి 26 వ తేదీన హైదరాబాదులోనే జన్మించారు. వీరి తల్లిదండ్రులు.. తండ్రి రాజయ్య.. తల్లి లక్ష్మీ నరసమ్మ.. హైదరాబాద్ లోనే న్యూ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఇక కొంత కాలానికి నర్సింగ్ యాదవ్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు చిత్ర యాదవ్..ఇక వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు.ఆ అబ్బాయి పేరు రుత్విక్.


నర్సింగ్ యాదవ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కొంతకాలం విలన్ పాత్రలో నటించి, ఆ తర్వాత కమెడియన్ గా తన సినీ జీవితాన్ని ఆరంభించాడు. మొదటిసారి ప్రముఖ నిర్మాత అలాగే దర్శకురాలు అయినా విజయనిర్మల దర్శక నిర్మాతగా తెరకెక్కిన హేమాహేమీలు అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి పరిచయమయ్యారు నర్సింగ్ యాదవ్. అయితే ఇక్కడ రాంగోపాల్ వర్మ, నర్సింగ్ యాదవ్  ఇద్దరూ  ఇంటర్మీడియట్ లో  ఓకే కళాశాలలో చదువుకోవడం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన క్షణక్షణం సినిమాలో చెప్పుకోదగిన పాత్ర పోషించి ,మంచి గుర్తింపు పొందాడు. తరువాత కొబ్బరి బొండం అనే సినిమాలో కూడా నటించడం జరిగింది.


అల్లరి ప్రేమికుడు, మాయలోడు,మాస్టర్ , ముఠామేస్త్రి,ఠాగూర్ , నువ్వొస్తానంటే నేనొద్దంటానా,యమదొంగ, ఇడియట్, గాయం,  జానీ, పోకిరి శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ తదితర చిత్రాల్లో మంచి చెప్పుకోదగిన పాత్రల్లో నటించి , అందరి చేత మన్ననలు పొందారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో దాదాపు మూడు వందల సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు పొందాడు. చివరిసారిగా ఈయన 2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన మూత్రపిండాల సమస్య తో హైదరాబాదులో మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: