వివాహ సమయంలో తల్లీ, తండ్రీ కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో నవవధువులు శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవితో సమానం. కన్య అని మంత్రోక్తంగా తండ్రి చెప్పి వివాహం జరిపిస్తాడు. ఆ వధవు కన్యకాకపోతే తద్వారా మంత్రయుక్త దోషమూ, అసత్య దోషమూ జరుగుతుంది. కామంతోగానీ, ఆకర్షణతోగానీ, కన్యత్వం చెడి పెళ్ళి పీటలెక్కితే ఆ స్త్రీ తల్లికీ, తండ్రికీ పితృదేవతలకీ వివాహ పుణ్యఃఫలంరాదు. ఆపాపం ఈ స్త్రీ ఏదో రూపంలో భరించాల్సిందే. చేసిన తప్పుకు అనుక్షణం పశ్చాత్తాపం చెందుతూ భర్తతో కాపురం చేయ్యటమే ఆ స్త్రీకి దేవుడిచ్చిన శిక్ష. కూతురిని క్రమశిక్షణలో పెంచుతూ, భద్రతగా అల్లుడనే శ్రీమహావిష్ణువుకి అప్పచెప్పకపోయినందుకు ఆ తల్లీ,తండ్రీ కూడా ఏదో ఒక అంటు వ్యాధితో బాధపడాల్సిందే. ధర్మబద్దమైనది అయినది అయినా పెళ్ళికాక ముందు ఆవేశంతో, ఏదో అనుభవించాలన్న ఆతృతతో సూర్యుని ద్వారా పుత్రుణ్ణి కన్నందుకు కుంతీదేవి అన్ని కష్టాలూ అంత వేదనాపడింది. చివరకు దావాగ్నిలో బూడిదయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: