హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శివ భక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. ప్రదోష వ్రతం రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణ మరియు శుక్ల పక్షాల త్రయోదశి తిథి నాడు ప్రదోష ఉపవాసం పాటిస్తారు. ప్రదోష ఉపవాసం ఫలాలు, పేర్లు వారం ప్రకారం ఉంటాయి. ప్రదోష కాల సమయంలో శివుడిని పూజించడం వలన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

ఈసారి అశ్విని మాసంలోని ప్రదోష ఉపవాసం సోమవారం నాడు వస్తుంది. కాబట్టి ఆ రోజును సోమ ప్రదోష ఉపవాసం అంటారు. ఈ రోజున శివుడు, పార్వతికి పూజలు నిర్వహిస్తారు. సోమ ప్రదోష ఉపవాసం రోజున ఆరాధన, పూజ చేయడానికి ఏ సమయం శుభప్రదమో తెలుసుకుందాం.

సోమ ప్రదోష వ్రత ప్రాముఖ్యత
సోమ ప్రదోష వ్రతం రోజు శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున భక్తులు శివుడిని, పార్వతి తల్లిని ఆచారాల ద్వారా పూజిస్తారు. ఈ ఉపవాసం పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజు ఉపవాసం ఉండటం వలన సంపద, కీర్తి లభిస్తుంది. అంతే కాకుండా ఈ రోజు చంద్రుడిని పూజించాలి. అలా పూజించడం వలన చంద్ర గ్రహానికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి.

సోమ ప్రదోష పూజకు శుభ సమయం
అశ్విని మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి ప్రదోష ఉపవాసం 04 అక్టోబర్ 2021న జరుగుతుంది. ఈ రోజు సోమవారం వస్తుంది. అశ్విన్ నెల త్రయోదశి తిథి అక్టోబర్ 03 ఆదివారం రాత్రి 10.29 నుండి ప్రారంభమవుతుంది. 04 అక్టోబర్ 2021న సోమవారం రాత్రి 09:05 వరకు ముగుస్తుంది. ప్రదోష కాలంలో సోమ ప్రదోష ఉపవాసం పాటించడం శ్రేయస్కరం. ప్రదోష కాల శుభ ముహూర్తం అక్టోబర్ 04, సాయంత్రం 06:04 నుండి సాయంత్రం 08:30 వరకు ఉంటుంది.

ప్రదోష వ్రత పూజ విధానం
ఉదయాన్నే నిద్రలేచి స్నానాదికాలు ముగించి శివుని ముందు దీపం వెలిగించి ఉపవాసం ఉండాలి. శివుడిని బిల్వ పత్రాలు, నెయ్యి, గంగాజలంతో అభిషేకించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: