తిరుపతిలో 30న  గో  మ‌హాస‌మ్మేళ‌నం :  ఏర్పాట్లను సమీక్షించిన టిటిడి ఈవో జవహర్ రెడ్డి

గోవుల  సంర‌క్ష‌ణ‌, గో-ఆధారిత వ్య‌వ‌సాయంపై కర్షకులకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డమే ల‌క్ష్యంగా అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న గో మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ |ఆఫీసర్  కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి సమీక్షించారు. తిరుమల లోని అన్నమయ్య భవన్ లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. తిరమల శ్రీ వేంకటేశ్వర స్వామికి  గో ఆధారిత నైవేద్యాన్ని సమర్పించాలని చెప్పారు.  ఈ  కార్యక్రమాన్ని సక్రమంగా అమ‌లు చేయాలన్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయన అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తిలో రెండు రోజుల పాటు  గో మ‌హాస‌మ్మేళ‌నం జరుగుతుందని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు తిరుపతిలోని  శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియం  తో పాటు,  తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వ ద్ద ఉన్న మ‌హ‌తి ఆడిటోరియంను ప‌రిశీలించాలన్నారు. ఈ మహా సమ్మోళనానికి పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు,  ఎందరెందరో స్వామీజీలు వస్తున్నారని తెలిపారు. దక్షిణ భారత దేశం నుంచే కాక, ఉత్తర భారత దేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని జవహర్ రెడ్డి తెలిపారు.
కోవిడ్-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిబ్బందిని అదేశించారు.  రోజుకు వెయ్యి మంది రైతులు సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందు కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.  వసతి సౌకర్యాలకు ఒక కమిటీ, భోజన ఏర్పాట్లకు ఒక కమిటీ, రవాణా సదుపాయాలకు ఇంకోక  కమిటీని ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా  మరికొన్ని ఉప కమిటీలు ఏర్పాటు చేసుకుని  ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి  టిటిడి అధికారులను అదేశించారు. యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ , టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులువిజ‌య్‌రామ్‌, ర‌మేష్ గుప్తా,   అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు,  గోశాల సంచాలకులు హారనాథ్ రెడ్డి,తదితరులు ఈ సమావేశంంలో పాల్గొన్నారు.
31న భారీ బహిరంగ సభ
గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించాలని డీమాండ్ చేస్తూ ఈ నెల31 భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు యుగ తులసి ఫౌండేషన్ పేర్కోంది.  గో మహా సమ్మెళనం తురువాత ఈ భారీ బహిరంగ సభ  ఉంటుందని  ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.  తిరుమపతిలోని తారక రామా స్టేడియంలో ఈ సభ నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.  కర్ణాటక లోని గోకర్ణం మఠం పీఠాధిపతి రాఘవేశ్వర భారతి మహా స్వామీజీ ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తారని యుగ తుల సి ఫౌండేషన్ ప్రకటించింది. దక్షిణ భారత దేశంలోనే ఇది అతి పెద్ద భారీ  కార్యక్రమం అని తెలిపింది.  ఇందుకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేసింది. గోకర్ణం పీఠాధిపతి రాఘవేశ్వర భారతి మహాస్వామి  గత కొన్ని సంవత్సరాలుగా అభయాక్షర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  గోవులను కబేళాలకు తరలించడాన్ని ఆపాలని ఆయన  దక్షణ భారత దేశంలో ప్రచార కారక్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: