మన పూర్వీకుల నుంచి కొన్ని ఆచారాలు వస్తూ ఉంటాయి.. అందులో కొన్నిటి మాత్రమే కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. మరి కొంతమంది పండితులు చెప్పిన విధంగా పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా కొన్నిటికి వర్తిస్తాయట.. ఇలాంటి నియమాలను కొంతమంది పాటిస్తూ ఉంటారు మరి కొంతమంది అసలు పాటించారు. అయితే ఇలాంటి నియమాలలో మనం కొన్నిటిని మాత్రం వదిలేస్తూ ఉంటాము.. వీటివల్ల మనకు చాలా దరిద్రం చుట్టుకుంటుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇలాంటి తప్పులు చేయకూడదట వాటి గురించి తెలుసుకుందాం.


ఎక్కువమంది భోజనం తిన్న తర్వాత ప్లేట్లో కచ్చితంగా ప్లేట్లు కడుగుతూ ఉంటారు అయితే ఈ తప్పు చేయడం వల్ల ఆహారం నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందట.. అంతేకాకుండా తినే ఆహారాన్ని మనం అవమానించినట్లే అవుతుందంటూ పండితులు హెచ్చరిస్తున్నారు.. మనం అన్నం తిన్న తర్వాత చెయ్యి ప్లేట్లో కడుక్కోవడానికి బదులు బయట చెట్ల దగ్గర కడుక్కోవడం చాలా మంచిదట. భోజనం చేసిన వెంటనే ఆ పాత్రలను మొత్తం ఆ సమయంలోనే కడిగేయాలి ఉదయం పూట కడగడం మహా దరిద్రమటభోంచేసేముందు కచ్చితంగా అన్నపూర్ణాదేవిని స్మరించుకోవడం చాలా మంచిదని పండితులు తెలుపుతున్నారు. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే ఏవైనా మూగజీవాలకు అన్నం పెట్టడం చాలా మంచిదట.. ప్రతిరోజు ఇలాంటివి చేయకపోవడం వల్ల వారి జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.ముఖ్యంగా గ్రహాలు కూడా ఇలాంటి సమయంలో వ్యతిరేకంగా పనిచేస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వారు మానుకోవడం చాలా మంచిదట.


సాయంత్రం వేళ ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చి అన్నం అడిగినట్లు అయితే పెట్టడం చాలా మంచిదట. ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి వారి ఇంటికి తలుపు తడుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: