సంక్రాతి అంటేనే ఆనందాల పండుగ.పిల్లలకు పతంగుల పండుగ.ఆడవారికి ముగ్గులు,గొబ్బెమ్మల పండుగ.మగవారికి ఎద్దుల పందాలు, కోడి పందాల పండుగా.అంతేనా హరిదాసుల పండుగ.గంగిరెద్దుల పండుగ.పాటల పండుగ. జానపదాల పండుగ. జనపదాల పండుగ.ఇంతటి సర్వశుభాలను కలిగించే పండుగ ఇంకోటి లేదు.

హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగ రోజుల్లోనే కనిపించేది.భోగి, మకర సంక్రాంతి,కనుము అంటూ మూడు రోజుల పాటు ఆనందంగా,పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు.మరియు ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణ కథనం.

ఈ పండుగలో చివరి రోజు కనుమ.ఈరోజున పెద్దవాళ్లకు తర్పణలు ఇవ్వడం,దేవతలకు పొట్టేళ్ళు,కోళ్లు బలి ఇచ్చి,వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.ఈ రోజున శరీరానికి చలువనిచ్చే మినుములతో తయారుచేసిన వంటకాలు తినడం అనవయితీ. మరియు పశువులను కూడా తమలో ఒక్కరిగా భావించి, వాటికీ ఇష్టమైన ఆహారాన్ని సైతం వండి పెడతారు.

ఇవ్వన్నీ పక్కన పెడితే కచ్చితంగా కనుమ రోజున  ఎవరూ కుడా పొలిమేర దాటకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు.ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదని చెబుతారు.అందుకే కనుమ రోజున ఎవ్వరూ ప్రయాణాలు చేయకూడదని,అలా చేస్తే అశుభ ఫలితాలొస్తాయని గట్టిగా నమ్ముతారు.ఒకవేళ ప్రయాణిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండీ..

ఈ పండగ సమయంలో చాలామంది పల్లెల్లో పొలిమేర దేవతలకు పూజలా నిర్వహిస్తూ ఉంటారు.ఆ సమయంలో దేవతలు ఆ ఊరి చుట్టూ రక్షణ విధిస్తారని నమ్ముతాము.కనుక ఆ రక్షణ కాపాడడానికి ఆ ఊరులోని వారు ఎక్కడికి ప్రయాణించకూడదు అని చెబుతుంటారు.ఒకవేళ ఎవరైనా ఈ ఆ నియమాన్ని వ్యతిరేకించి ప్రయాణాలు కొనసాగిస్తే,వారికి కచ్చితంగా చెడు పీడలు కలుగుతాయని చెబుతారు.మరియు పురాణాల ప్రకారం,పుష్య మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.ఈరోజున దేవతలందరూ మన ఇంటికి వస్తారని,అందుకే కనుమ,ముక్కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు పండితులు సూచిస్తారు.

కావున మీరు కూడా కనుమ రోజు ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే,వాయిదా వేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: