ఇంటర్నెట్ డెస్క్: బ్యాట్స్‌మెన్ బంతిని బౌండరా బాదాడు. ఆ బంతిని అక్కడే ఉన్న ఫీల్డర్ చూసి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అది బౌండరీకి వెళ్లిపోయింది. ఇందులో వింతేముంది..? అంటారా..? కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఫీల్డర్ అప్పుడు చొక్కాలేకుండా గ్రౌండ్లో పరిగెత్తాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం యూఏఈలో టీ10
క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సాయంత్రం నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి జట్ల మధ్య 14వ లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ విరామ సమయంలో కాకుండా ఏకంగా జరుగుతుండగానే అబుదాబి ఆటగాడు
రోషన్ తన
జెర్సీ మార్చుకునేందుకు ప్రయత్నించాడు.

కానీ ఇంతలోనే ప్రత్యర్థి ఆటగాడు బౌండరీ కొట్టేశాడు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే.. ఆ బంతి నేరుగా
రోషన్ వైపే వచ్చింది. దీంతో
జెర్సీ పూర్తిగా వేసుకోకుండానే ఆ బంతిని ఆపేందుకు
రోషన్ అటుగా పరిగెత్తాడు. కానీ బంతి విఫలమయ్యాడు. దాంతో బంతి బౌండరీ దాటేసింది. ఈ తంతంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డయింది.
రోషన్ పరిస్థితిని చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా తెగ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 123/3 స్కోర్ సాధించింది. లూక్రైట్(33), జో క్లార్క్(50), డకెట్(31) జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన నార్తన్ టీమ్ ఓపెనర్లు లెండిల్ సిమన్స్(37), వసీమ్ మహ్మద్(76) చెలరేగి ఆడడంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది.