ఇక మరికొన్ని రోజులు ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు అనుమతించటం లేదు. దీంతో ఎన్నో జట్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయ్. దీంతో ఐపీఎల్ జట్లలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫేస్ 2 లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ జట్టు లో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జట్టులో కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం టిమ్ డేవిడ్ అనే సింగపూర్ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు ఫైనల్ అలెన్ స్థానంలో టీమ్ డేవిడ్ ఆడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా సింగపూర్ నుంచి ఆటగాళ్లు పాల్గొనలేదు. కానీ మొదటిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో జట్టులో సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ఆడనున్నాడు. ఇతనికి 14 అంతర్జాతీయ టీ20 లు ఆడిన అనుభవం ఉంది. మరీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో రాణిస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి