ఇప్పటివరకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఒక్క సారి కూడా సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన దాఖలాలు లేవు. చాలామంది కెప్టెన్లు మారారు కానీ అటు టీమిండియాకు మాత్రం సఫారీ గడ్డపై విజయం వరించలేదు అని చెప్పాలి. దీంతో సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించడం టీమిండియాకు ఒక చీర కల కలగానే మిగిలిపోయింది. అయితే ఇటీవలే కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా  టెస్ట్ సిరీస్ ఆడేది. ఇక ఈ టెస్టు సిరీస్లో భాగంగా కోహ్లీసేన శుభారంభం చేసింది. మొదటి టెస్టు మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించింది టీమిండియా.


 దీంతో ఇక ఈ సారి టీమిండియాకు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్టు సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. కాని అంతలోనే కోహ్లీ వెన్నునొప్పి కారణంగా దూరం కావడంతో కెఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక మూడో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ కోలుకొని జట్టులోకి వచ్చిన అప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా జట్టు టీమిండియా పై విజయం సాధించి తమ విజయ పరంపర కొనసాగించింది. ఇక మరో సారి టీమిండియాకు సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయింది. టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమి పై ఇటీవల సౌతాఫ్రికా కెప్టెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత వికెట్లు దక్కకపోవడంతో టీమిండియా ఒత్తిడికి గురి అయింది అంటూ చెప్పుకొచ్చాడు ఎల్గర్. రివ్యూలో తాను నాటౌట్ అని తేలడంతో భారత ఆటగాళ్లు మరింత అసహనానికి లోనయ్యారు అని చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా కెప్టెన్. ఇక రివ్యూ గురించి ఆలోచిస్తూ పాట మీద దృష్టి పెట్టలేక పోయారని.. ఇక అదే సమయాన్ని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లు బాగా ఉపయోగించుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా ఓటమి కి కారణం ఇదే అంటూ సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: