సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో అద్భుతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు స్పిన్నర్లు వేసే బంతులు టర్న్ తీసుకునే తీరు క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎప్పుడైనా ఇలాంటిది జరిగింది అంటే అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది  ఇక ఇప్పుడు కౌంటి మ్యాచ్ సందర్భంగా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


 కౌంటి మ్యాచ్ సందర్భంగా సౌత్ ఆఫ్రికా ఆఫ్ విన్నర్ షిమోన్ హార్మోర్ వేసిన అద్భుతమైన డెలివరీ ఏకంగా బ్యాటర్ ను నోరేళ్లపెట్టేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వికెట్ కోల్పోయిన బ్యాటర్ ఇది నిజమా కల అని కాసేపటి వరకు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇటీవలే కౌంటి క్రికెట్ లో భాగంగా నార్తాంప్టన్ షైర్, ఎసెక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఎసెక్స్ బౌలర్ షిమోన్ హార్మోర్ బంతిని ఆఫ్ స్టంప్ అవతల వేశాడు. అయితే బంతి వైడ్ వెళుతుందని భావించిన నార్థాంప్టన్  కెప్టెన్ విల్ యంగ్ పూర్తిగా ఆఫ్ స్టంప్  అవతలికి వచ్చాడు. కానీ ఇంతలో ఊహించిన ట్విస్ట్. అనూహ్యమైన టర్న్ తీసుకున్న సదరు బంతి మిడిల్ స్టంప్ ఎగరగొట్టింది. ఏం జరిగిందో అర్థం కాక విల్ యంగ్ కాసేపు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయి నిలబడిపోయాడు. ఇక ఆ తర్వాత అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో చివరికి కన్ఫ్యూజన్లోనే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా కొంతమంది అభిమానులు ఈ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణిస్తూ  ఉండడం గమనార్హం  . మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: