ఐపిఎల్ లో ప్రస్తుతం కొనసాగుతున్న 10 టీమ్ లు తమ జట్టులో ఎవరిని ఉంచుకోవాలి మరియు ఎవరిని మిని వేలానికి వదిలేయాలి అన్న విషయంపై నిర్ణయాలు ఫైనల్ అయిపోయాయి. ఇక మిగిలింది నెక్స్ట్ సీజన్ కు ఉన్న ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకుని టైటిల్ ను సాధించాలి అని ప్రణాళికలు రచించుకునే పనిలో పడ్డారు ఫ్రాంచైజీ యాజమాన్యం మరియు టీమ్ కోచ్ లు సిబ్బంది. కొన్ని ఫ్రాంచైజీలు అయితే కెప్టెన్ లుగా ఉన్న ఆటగాళ్లను సైతం వేలానికి వదిలేసి సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ ఫ్రాంచైజీ లలో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీమ్ కు కెప్టెన్ గా న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉన్న విషయం తెలిసిందే.

అయితే సన్ రైజర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేన్ మామ న్యాయం చేయడంలో దారుణంగా విఫలం అయ్యాడు. అందుకే రానున్న సీజన్ కు కెప్టెన్ గానే కాకుండా.. ఒక ఆటగాడిగా కూడా అతనికి స్థానం ఇవ్వకుండా వేలానికి వదిలేసింది. దీనితో సన్ రైజర్స్ కు కెప్టెన్ ను ఎంచుకునే బాధ్యత మిగిలిపోయింది. సన్ రైజర్స్ యాజమాన్యం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం జట్టు అంటి పెట్టుకుని ఉన్న ఆటగాళ్లలో ఒకరిని కెప్టెన్ గా ఎంచుకుంటారు అని తెలుస్తోంది. ఇక కెప్టెన్ రేస్ లో ఉన్నది యువ పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మగా  తెలుస్తోంది. కానీ ఇతనికి అంతగా అనుభవం లేదు అని బయట నుండి వినిపిస్తున్న టాక్. గత సీజన్ లోనూ ఓపెనర్ గా బరిలోకి దిగి పర్వాలేదనిపించాడు.

సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ మాత్రం ఈ కుర్రాడికి జట్టు పగ్గాలు అప్పగించాలి అనుకుంటోందట. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరు అభిప్రాయం ప్రకారం భువనేశ్వర్ కుమార్ లేదా ఐడెన్ మార్ క్రామ్ లను కూడా ఇందుకోసం పరిశీలిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. టీమ్ లో ఉన్న అందరినీ కలుపుకుని పోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడు అయితే బాగుంటుంది అని క్రికెట్ ప్రముఖులు భావిస్తున్నారు. మరి ఈ నిర్ణయం అధికారికం అయితే కావ్య పాప పొరపాటు చేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: