
సలీం మాలిక్ కంటే తాను రెండేళ్లు జూనియర్ కావడంతో ఏకంగా అన్ని పనులు తనతోనే చేయించుకునే వాడు అంటూ చెప్పవచ్చాడు. కొన్ని కొన్ని సార్లు అయితే బట్టలు ఉతికించడం... బూట్లు తుడిపించుకోవడం లాంటివి కూడా చేశాడని.. ఇక నాకంటే జూనియర్ల ముందు నన్ను అవమానించేలా ప్రవర్తించడంతో ఎంతో కోపం వచ్చేది అంటూ వసీమ అక్రమ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక అందరూ కూడా దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ స్పందించాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే తనపై వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలను సలీం మాలిక్ తోసిపుచ్చాడు అని చెప్పాలి. వాస్తవానికి వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మేము అప్పట్లో ఏ దేశానికి పర్యటనకు వెళ్లిన కూడా అక్కడ ల్యాండ్రీ మిషన్లు ఉండేవి. అలాంటప్పుడు అతనితో నేను ఎందుకు బట్టలు ఉతికిస్తాను. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడు. ఇక ఇలాంటి వాటిపై నేను మాట్లాడాలి అనుకోవట్లేదు అంటూ సలీమ్ మాలిక్ చెప్పుకొచ్చాడు. అయితేవసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలన్నీ ప్రస్తుతం కేవలం కల్పితాలు మాత్రమే అంటూ సలీం మాలిక్ చెప్పిన నేపథ్యంలో దీనిపై వసీం అక్రమ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.