ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఎంతో బలహీనంగా ఉన్న బంగ్లాదేశ్ ను ఓడించలేకపోయింది అన్న విషయం తెలిసిందే. మొదటి వన్డే మ్యాచ్లో గెలవాల్సిన భారత జట్టు చివరికి ఓటమి చవిచూస్తుంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఓటమిపై భారత క్రికెట్ ప్రేక్షకులు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా తీవ్రస్థాయిలో వసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రదర్శన చేస్తే రాబోయే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కప్పు గెలవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతోమంది అభిమానులు. ఇకనైనా భారత ఆటతీరులో మార్పు వస్తే బాగుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ ఒక ఆటగాడిగా కెప్టెన్ గా కూడా జట్టుకు మైనస్ గా మారిపోతున్నాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు.


 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావాస్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్లాస్ పీకాడు. బౌలింగ్ విభాగం బాగా రాణించినప్పటికీ బ్యాటింగ్ లో తేలిపోయామని.. మరో 40 పరుగులు చేసి ఉంటే బాగుండేదని ఓటమిపై సాకు చెప్పాడు రోహిత్.


 ఇక ఇదే విషయంపై స్పందించిన గవాస్కర్ మాట్లాడుతూ.. మ్యాచ్ అక్కడ ముగిసి ఉంటుందని నేను నమ్ముతున్నాను.  మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో 136 పరుగులకు 9 వికెట్లు తీశారు.  హసన్ మీరాజ్ కు కూడా అదృష్టం వరించింది. అతని క్యాచ్ లు పడిపోయాయి. అయితే భారత్ ఇంకో 80 పరుగులు చేసి ఉంటే బాగుండేది.  ఫలితం మరోలా ఉండేది. ఇక టీమిండియా ఓటమికి వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేయడం కాదు రోహిత్ వ్యూహాలే కారణం అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మీరు చెప్పింది కూడా నిజమే అంటూ అభిమానులు ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: