
ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా లెజెండరి క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం భారత బౌలర్ల ఆట తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ ఆటగాడు ఇలాంటివి అస్సలు చేయకూడదు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కొన్ని మన నియంత్రణలో ఉండవని.. ఇక ఈ కాలం ఆటగాళ్లు వీటిపై తరచూ చెప్పే సమాధానం వింటూ ఉన్నాము. అయితే నో బాల్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది.. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు అనేవి వేరే విషయాలు.. నోబాల్స్ వేయకపోవడం అనేది కచ్చితంగా బౌలర్ల నియంత్రణలోనే ఉంటుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు అని చెప్పాలి.
ఇక ఇదే విషయంలో సునీల్ గవాస్కర్ కు సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు అని చెప్పాలి. అయితే పెద్దగా ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఏకంగా ఏడు నో బాల్స్ వేసింది. ఇందులో అర్షదీప్ సింగ్ ఒక్కడే ఏకంగా ఐదు నోబాల్స్ సందించగా శివమ్ మావి 1,, ఉమ్రాన్ మాలిక్ మరొక నో బాల్ వేసి ప్రత్యర్థులకు పరుగులు సమర్పించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలా భారత బౌలర్లు వేసిన నోబాల్స్ అటు టీమిండియా కొంపముంచాయి అని చెప్పాలి.