సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు క్రికెటర్లు నవ్వు తెప్పించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక టీంలో తమకు ఎంతో క్లోజ్ గా ఉండే వారితో ఏకంగా చిన్నపిల్లడి లాగా చిలిపి చేష్టలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి టీమిండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఇక తమ తోటి క్రికెటర్లతో అల్లరి చేసిన వీడియోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తు ఉంటాయి. ముఖ్యంగా టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న చాహుల్ ఇలా అల్లరి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు.


 ఏకంగా భారత జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తన సొంత సోదరుడిలా భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఇక కుల్దీప్ యాదవ్ ను టీస్ చేయడం ఏకంగా కొన్ని కొన్ని సార్లు స్నేహితుడిలా చేయి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పాలి. మరోసారి ఇలాంటిదే చేసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో 90 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్స్ వేపు చేసింది టీమ్ ఇండియా జట్టు.


 అయితే ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో టీమ్ ఇండియా స్పిన్నర్ చాహల్ ఏకంగా కుల్దీప్ యాదవ్ను టీస్ చేస్తూ చిన్నపిల్లాడి లాగానే ప్రవర్తించాడు. ఏకంగా అతని చెవులు పట్టుకుని గట్టిగా లాగాడు. అయితే ఆ సమయంలో అటు కుల్దీప్ యాదవ్ ఏం రియాక్ట్ ఇవ్వకపోవడం గమనార్హం. అదే సమయంలో అక్కడే ఉన్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ నిజంగా చాహాల్ కు వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఒక లుక్ ఇచ్చాడు. ఇదంతా అక్కడున్న వారు సరదా కోసమే చేశారు అన్నది ఈ వీడియోలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పాలి. వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: