
దీంతో ఇక ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ వార్త గురించి తెలిసి షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అయిన మహమ్మద్ హఫీజ్ ఇంట్లో ఇటీవలే చోరీ జరిగింది. ఇక ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. లాహూర్ లోని మహమ్మద్ హఫీజ్ ఇంట్లో మార్చ్ 5వ తేదీన చోరీ జరిగిందట. ఏకంగా 25 వేల డాలర్లు అంటే పాకిస్తాన్ రూపాయలలో రెండు కోట్ల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారట. ఇలా చోరీ జరిగిన సమయంలో హాఫిజ్, అతని భార్య ఇంట్లో లేరట.
అయితే ఇక మహ్మద్ హాఫిజ్ ఇంట్లో దొంగలు చొరపడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఇక మహమ్మద్ హఫీజ్ అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే పాకిస్తాన్ జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన మహమ్మద్ హఫీజ్ 2022 జనవరి 3వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు మహమ్మద్ హాఫిజ్. ఇలా స్టార్ క్రికెటర్ ఇంట్లో దొంగలు పడటం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.