సాదరణంగా క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం గా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఎంపైర్ నిర్ణయంపై అనుమానాలు ఉన్నప్పుడు ఇక అతని నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. డిఆర్ఎస్ అనే రూల్ ద్వారా రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా రివ్యూ తీసుకున్నప్పుడు ఎంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది ఇక మరోసారి రివ్యూ లో అంపైర్ చెక్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే క్రికెట్లో ఇక ఇలా రివ్యూ విషయంలో కెప్టెన్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.


 ఎందుకంటే ఇక ఏదైనా జట్టు కెప్టెన్ తప్పుడు రివ్యూ తీసుకున్నారు అంటే ఇక ఆ తర్వాత సరైన సమయంలో రివ్యూ తీసుకోవడానికి కూడా ఆ జట్టుకు అవకాశం ఉండదు అని చెప్పాలి. అందుకే రివ్యూ విషయంలో ఎంతో ఆచీ చూచి వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం రివ్యూ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరికి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న రివ్యూ విమర్శలకు దారితీస్తుంది అని చెప్పాలి.


 ఆసిస్ ఇన్నింగ్స్ సమయంలో 128వ ఓవర్ వేశాడు రవీంద్ర జడేజా. ఇక ఆ ఓవర్లో చివరి బంతిని ఉస్మాన్ ఖవాజా ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయ్యి ప్యాడ్స్ కు తగిలింది. ఇక అప్పటికే టీమ్ ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు ఉస్మాన్ ఖవాజా. దీంతో అతని ఎలాగైనా అవుట్ చేయాలనే పట్టుదలతో కనిపించిన రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యుగా అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ మాత్రం నాట్ అవుట్ గా నిర్ణయాన్ని తెలిపాడు. ఇక వెంటనే జడేజా కెప్టెన్ రోహిత్ శర్మ పై ఒత్తిడి తెచ్చి రివ్యూ తీసుకునేల చేశాడు. ఇక రిప్లై లో చూశాక రోహిత్, జడేజా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే రిప్లై లో చూస్తే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా దూరంలో ఉన్నట్లు కనిపించింది. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ ఇది క్రికెట్ చరిత్రలోనే చెత్త రివ్యూ అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: