సాధారణంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రిటీగా కొనసాగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే . కోహ్లీ లాంటి ఆటగాడితో తమ బ్రాండ్ ని ప్రమోషన్స్  చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందుకే ఇక అందరితో పోల్చి చూస్తే బ్రాండ్ వాల్యూ విషయంలో టాప్ లో ఉంటాడు. కానీ ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో ఏకంగా విరాట్ కోహ్లీకే షాక్ ఇచ్చాడు. బ్రాండ్ వ్యాల్యూ విషయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి రికార్డు సృష్టించాడు.


 బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ అత్యంత బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా అవతరించాడు అని చెప్పాలి. కాగా గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీని వెనక్కినట్టి తొలి స్థానంలోకి వచ్చేసాడు. 2022 సంవత్సరానికి గాను సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూషన్ స్టడీ పేరిట కన్సల్టింగ్ సంస్థ క్రెల్ ఇచ్చిన జాబితాలో 185.1 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు అని చెప్పాలి. కాగా బ్రాండ్ ఎండార్స్మెంట్, ప్రపంచ వ్యాప్తంగా ఉనికి ఆధారంగా బ్రాండ్ విలువను లెక్కించి క్రెల్ ఈ తరహా జాబితాను సిద్ధం చేస్తూ ఉంటుంది. 2022 ఏడాదికి గాను 25 మందితో ఈ జాబితాను ఇటీవల ప్రకటించింది. కాగా టాప్ 25 సెలెబ్రెటీల మొత్తం బ్రాండ్ విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే 29.1% పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ జాబితా విషయానికొస్తే.. 2020లో 237.3 మిలియన్ డాలర్లుగా ఉన్న కోహ్లీ బ్రాండ్ విలువ.. 2021లో 185.7 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక ఇటీవల విడుదల చేసిన నివేదిక చూసుకుంటే 176.9 డాలర్లకు మరింతగా పడిపోయింది అని చెప్పాలి. కోహ్లీని వెనక్కి నెట్టిన బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 185.1 మిలియన్ డాలర్లతో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ రెండవ స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక బాలీవుడ్కు చెందిన అక్షయ్ కుమార్ 158. 3 మిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో అల్లు అర్జున్ 20వ స్థానంలో, రష్మిక25వ స్థానంలో ఉండడం గమనర్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: