గత ఏడాది ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గుజరాత్ ఆడిన మొదటి సీజన్లోనే ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు తర్వాత ఇలా ఆడిన మొదటి సీజన్లోనే ఐపిఎల్ టైటిల్ గెలిచిన ఏకైక టీం గా గుజరాత్ టైటాన్స్ అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. అయితే గుజరాత్ మెరుపులు కేవలం ఒకే ఫార్మాట్ కి పరిమితం అవుతాయి అని అందరు అనుకున్నారు.


 అయితే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్ లో కూడా అదే రీతిలో విజయవంతమైన ప్రస్థానం కొనసాగించింది గుజరాత్. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా కనిపిస్తూ.. ఒక రకంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో ఎప్పుడు అగ్రస్థానంలో కొనసాగింది గుజరాత్  జట్టు అని చెప్పాలి. దీంతో గుజరాత్ జోరు చూస్తే తప్పకుండా టైటిల్ గెలుస్తుందని అందరం అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ చివరికి రన్నరప్ తో  సరిపెట్టుకుంది అని చెప్పాలి.


 అయితే ఐపీఎల్ ముగిసినప్పటికీ ఇంకా ఐపీఎల్ కు సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గుజరాత్ ఓటమి గురించి స్పందించిన మాజీ ప్లేయర్లు గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ జట్టు ఓటమికి  కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణం అంటూ అభిప్రాయపడ్డారు. చివరి ఓవర్ లో ఫస్ట్ మూడు నాలుగు బాల్స్ మోహిత్ శర్మ అద్భుతంగా వేశాడు. అయితే ఓవర్ మధ్యలో హార్దిక్ పాండ్యా వెళ్లి మాట్లాడాడు. బౌలర్ రిధమ్ లో  ఉన్నప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఆ టైంలో ఎవరు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. దూరం నుంచి వెల్ బౌలింగ్ అని ప్రశంసిస్తే చాలు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం అతన్ని డిస్ట్రబ్ చేశాడు. దీంతో బౌలర్ అతను అనుకున్నట్లుగా బంతులు వేయలేకపోయాడు అంటూ ఇద్దరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: